ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mahzooz draw లో ముగ్గురు భారతీయులకు జాక్‌పాట్.. చెరో రూ.20లక్షలతో పాటు 100గ్రాముల గోల్డ్..

ABN, First Publish Date - 2021-12-03T14:46:03+05:30

మహజూజ్ లక్కీ డ్రాలో ముగ్గురు భారత ప్రవాసులకు జాక్‌పాట్ తగిలింది. ముగ్గురు చెరో లక్ష దిర్హమ్స్(రూ.20లక్షలు)లతో పాటు 100 గ్రాముల గోల్డ్ గెలుచుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయ్: మహజూజ్ లక్కీ డ్రాలో ముగ్గురు భారత ప్రవాసులకు జాక్‌పాట్ తగిలింది. ముగ్గురు చెరో లక్ష దిర్హమ్స్(రూ.20లక్షలు)లతో పాటు 100 గ్రాముల గోల్డ్ గెలుచుకున్నారు. దుబాయ్‌లో నిర్వహించిన 53వ వీక్లీ డ్రాలో ఇలా నజీష్, జగ్తార్, షేక్ అనే ముగ్గురు భారతీయులకు అదృష్టం వరించింది. వీరిలో నజీష్(33) క్వాంటిటీ సర్వే ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మహజూజ్‌లో పాల్గొంటున్నప్పటి నుంచి ప్రతి వారం నిర్వహించే డ్రా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసేవాళ్లం అంటూ నజీష్ చెప్పుకొచ్చారు. ఈసారి తమకు అదృష్టం వరించిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మహజూజ్ నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. 


షేక్ మాట్లాడుతూ.. గత శనివారం జరిగిన లక్కీ డ్రా ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నారు. ఎందుకంటే ఈ డ్రాతో మహజూజ్ వచ్చి ఏడాది పూర్తైంది. కనుక ఇది మహజూజ్‌కు ఫస్ట్ బర్త్‌డే. అదే డ్రాలో తాము భారీ మొత్తం గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు షేక్. అసలు కలలో కూడా ఇంత మొత్తం గెలుచుకుంటానని అనుకోలేదని, క్యాష్ ప్రైజ్‌కు బోనస్‌గా గోల్డ్ కూడా గెలవడం సంతోషమంటూ చెప్పుకొచ్చారు. షేక్ దుబాయ్‌లో డిజిటల్ మార్కెటింగ్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇటీవలే తన కూతురు ఫస్ట్ బర్త్‌డే అయిందని, తాను మహజూజ్‌లో గెలుచుకున్న మొత్తాన్ని ఆమె పేరు మీద డిపాజిట్ చేస్తానని ఆయన తెలిపారు.   


మరో ప్రవాసుడు జగ్తార్(41) మాట్లాడుతూ.. రూ.20లక్షలతో పాటు 100 గ్రాముల బంగారం గెలుచుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రైజ్‌మనీలో కొంత మొత్తం తన అప్పులు తీర్చడానికి, మరికొంత తన పిల్లల భవిష్యత్ కోసం వినియోగిస్తానని చెప్పారు. ఇక డిసెంబర్ 4(శనివారం)న నిర్వహించే ఈ వారం మహజూజ్ డ్రాలో విజేతలకు ఏకంగా 1కేజీ గోల్డ్ గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో ఈ డ్రా కోసం మహజూజ్‌లో పాల్గొంటున్నవారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈవింగ్స్ సీఈఓ, మహజూజ్ మేనేజింగ్ ఆపరేటర్ ఫరీద్ సామ్జీ మాట్లాడుతూ యూఏఈ అంటేనే అవకాశాల గడ్డ, ఇక్కడ తాము నిర్వహిస్తున్న మహజూజ్ నివాసితులకు లైఫ్‌టైమ్ సెటిల్‌మెంట్ అవకాశం అని తెలిపారు. ఈ వారం జరిగే గోల్డెన్ డ్రాలో విజేతలుగా నిలిచే వారి జీవితాలు రాత్రికి రాత్రే బంగారుమయం అవుతాయని పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-03T14:46:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising