ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌కు సాయం కోసం.. ముగ్గురు భారతీయ అమెరికన్ సోదరులు ఏం చేశారంటే..

ABN, First Publish Date - 2021-05-04T19:52:53+05:30

కరోనాతో పోరాడుతున్న మాతృదేశం భారత్‌కు తమ వంతు సాయం చేసేందుకు ముగ్గురు భారతీయ అమెరికన్ కవల సోదరులు ఏకంగా రూ. 2కోట్లకు పైగా విరాళాలు సేరకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: కరోనాతో పోరాడుతున్న మాతృదేశం భారత్‌కు తమ వంతు సాయం చేసేందుకు ముగ్గురు భారతీయ అమెరికన్ కవల సోదరులు ఏకంగా రూ. 2కోట్లకు పైగా విరాళాలు సేరకరించారు. ఈ నగదుతో కరోనా రోగులకు అవసరమయ్యే అత్యవసర వైద్య పరికరాలు కొనుగోలు చేసి భారత్‌కు పంపించనున్నట్లు ఈ ముగ్గురు కవలలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో ఉండే 15 ఏళ్ల వయసు గల గియా గుప్తా, కరీనా గుప్తా, అర్మాన్ గుప్తా అనే ముగ్గురు కవలలు 'లిటిల్ మెంటర్స్' పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నారు. తాజాగా కోవిడ్ వల్ల భారత్‌లో నెలకొన్న విషాదకర పరిస్థితులు ఈ కవలలను కలిచివేశాయి. భారత్‌లో ప్రాణవాయువు కొరతతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూసిన ఈ సోదరులు వెంటనే ఈ సమస్య పరిష్కారం దిశగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో స్నేహితులు, వారి కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద విరాళాల సేకరణ మొదలెట్టారు. ఈ క్రమంలో 2.80లక్షల డాలర్లు పొగు చేశారు. వీటితో వెంటనే వైద్య పరికరాలు కొనుగోలు చేసి, మాతృ దేశానికి పంపించనున్నట్లు పేర్కొన్నారు. 


ఈ సందర్భంగా ముగ్గురు సోదరులు మాట్లాడుతూ.. "ఇండియాలో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆక్సిజన్ కొరతతో చాలా మంది ప్రాణాలు కోల్పోతుండడం చూస్తుంటే గుండె బరువెక్కుతోంది. అందుకే ఈ ఆపత్కాలంలో మాకు తోచిన సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. వెంటనే మా లిటిల్ మెంటర్స్ సంస్థ ద్వారా స్నేహితులు, వారి సమీప బంధువుల వద్ద విరాళాల సేకరణ మొదలెట్టాం. భారత్‌లోని ప్రస్తుత పరిస్థితులను వారికి వివరించడంతో వారు పెద్ద మనసు చేసుకుని సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దాంతో భారీగా విరాళాలు అందాయి. ఇంకా వస్తున్నాయి. వీటితో కరోనా రోగులకు అవసరమైన వైద్య పరికరాలు కొనుగోలు చేస్తాం. వాటిని అసరమైన వారికి ఇవ్వాల్సిందిగా భారత్‌లోని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించనున్నాం. ఇక్కడ మా ఒక్కటే అభ్యర్థన.. నిజంగా అవసరం ఉన్నవారు మాత్రమే వీటిని వినియోగించుకోవాలి." అని గియా, కరీనా, అర్మాన్ గుప్తా చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న భారత్ త్వరలోనే వీటి నుంచి బయటపడుతుందని ఈ ముగ్గురు సోదరులు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ కఠిన సమయంలో ఒకరినొకరు సాయం చేసుకోవడం ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు.         

Updated Date - 2021-05-04T19:52:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising