ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెల్టా వేరియంట్‌తో అమెరికాకు ముప్పు: ఫౌచీ

ABN, First Publish Date - 2021-06-24T11:21:58+05:30

కరోనాను పూర్తిగా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాకు డెల్టా వేరియంట్‌తో పెనుముప్పు పొంచి ఉందని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ వైద్యరంగ సలహాదారు ఆంటోనీ ఫౌచీ హెచ్చరించారు. యూకేలో డెల్టా వేరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, జూన్‌ 23 : కరోనాను పూర్తిగా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాకు డెల్టా వేరియంట్‌తో పెనుముప్పు పొంచి ఉందని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ వైద్యరంగ సలహాదారు ఆంటోనీ ఫౌచీ హెచ్చరించారు. యూకేలో డెల్టా వేరియంట్‌ వల్ల ఏర్పడిన పరిస్థితులు అమెరికాలోనూ తలెత్తే అవకాశం ఉందన్నారు. భారత్‌లో తొలిసారి గుర్తించిన ఈ వేరియంట్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని మీడియాకు చెప్పారు. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 20 శాతం డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనన్నారు. దీనిపై అమెరికా వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తుండడం శుభపరిణామమని చెప్పారు.


కరోనా కట్టడికి ఉన్న అవకాశాలన్నింటినీ వాడుకోవాలని సూచించారు. కాగా, భారత్‌లోని కరోనా శాంపిళ్ల జన్యుక్రమాల విశ్లేషణ (జీనోమ్‌ సీక్వెన్సింగ్‌)పై దృష్టిసారించిన ఇండియన్‌ కొవిడ్‌-19 జీనోమిక్‌ కన్సార్టియా (ఐఎన్‌ఎ్‌సఏసీఓజీ) డెల్టా ప్లస్‌ పై కీలక ప్రకటన చేసింది. ‘‘ఆ వేరియంట్‌ వ్యాప్తిరేటు ఎక్కువ. ఊపిరితిత్తులలోని కణాల రిసెప్టర్లను అది బలంగా పట్టుకుంటోంది. మోనోక్లోనల్‌ యాంటీబాడీలతో తయారుచేసిన ఔషధాల ప్రభావశీలతను కూడా డెల్టా ప్లస్‌ తగ్గించేస్తోంది’’ అని పేర్కొంది.


Updated Date - 2021-06-24T11:21:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising