ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిడ్డ విమానంలో జన్మిస్తే.. ఏ దేశ పౌరసత్వం వస్తుందంటే..

ABN, First Publish Date - 2021-11-26T02:10:19+05:30

మనం ఏ దేశంలో జన్మిస్తే ఆ దేశ పౌరసత్వం లభిస్తుందన్న విషయం తెలిసిందే. మరి..విమాన ప్రయాణం మధ్యలో ఓ మహిళ ప్రసవిస్తే..పుట్టే బిడ్డ ఏ దేశ పౌరుడవుతాడు..? ఈ సందేహం మీకెప్పుడైనా కలిగిందా..? అయితే.. ఈ కథనం మీ కోసమే. రాజకీయంగా ఎంతో సంక్లిష్టంగా మారిన నేటి సమాజంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: మనం ఏ దేశంలో జన్మిస్తే ఆ దేశ పౌరసత్వం లభిస్తుందన్న విషయం తెలిసిందే. మరి..విమాన ప్రయాణం మధ్యలో ఓ మహిళ ప్రసవిస్తే..పుట్టే బిడ్డ ఏ దేశ పౌరుడవుతాడు..? ఈ సందేహం మీకెప్పుడైనా కలిగిందా..? అయితే.. ఈ కథనం మీ కోసమే.  రాజకీయంగా ఎంతో సంక్లిష్టంగా మారిన నేటి సమాజంలో పౌరసత్వం ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..! దీని ఆధారంగానే ఓ వ్యక్తికి సౌకర్యాలు, హక్కులు లభిస్తాయి. పౌరసత్వం, లేదా నివాసార్హత లేని అనేక మంది పరాయి దేశాల్లో కాందిశీకులుగా బతుకీడుస్తున్న ఉదంతాలు అందరికీ సుపరిచితమే. ఇక ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం.. భారత్‌లో జన్మించిన శిశువు సహజంగానే ఈ దేశ పౌరుడైపోతాడు. బిడ్డ తల్లిదండ్రులు విదేశస్తులైనా కూడా చిన్నారికి భారత్ దేశ పౌరసత్వం లభిస్తుంది. అయితే.. ఇలా విమానప్రయాణాల్లో జన్మించిన శిశువులకు ఏ దేశ పౌరసత్వం లభిస్తుందనే అంశంలో వివిధ దేశాలు సవివరమైన నిబంధనలు రూపొందించుకున్నాయి. 


ఉదాహరణకు .. ఓ విమానం భారత్ నుంచి అమెరికాకు వెళుతుండగా మార్గమధ్యంలో ఓ మహిళ ప్రసవించిందనుకుందాం. ఇటువంటి సందర్భంలో.. బిడ్డ జన్మించినప్పుడు విమానం ఏ దేశానికి చెందిన గగనతలంలో ఉంటే ఆ దేశ పౌరసత్వం వస్తుంది. తమ బిడ్డకు పౌరసత్వం ఇవ్వాలంటూ తల్లిదండ్రులు ఆ దేశాన్ని కోరే హక్కుంది. ఇక విమానం అమెరికా సరిహద్దు వద్ద ఉండగా జన్మిస్తే..చిన్నారికి అమెరికా పౌరసత్వం కావాలని తల్లి దండ్రులు కోరవచ్చు. తల్లిదండ్రులు ఏ దేశానికి చెందినవారన్న దానితో నిమిత్తం లేకుండా బిడ్డకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది. అమెరికా విమానం భారత్ సరిహద్దు వద్దు ఉనప్పుడు బిడ్డ జన్మించినా ఇదే నిబంధన వర్తిస్తుంది. అయితే..భారత ప్రభుత్వం డ్యుయెల్ సిటిజన్ షిప్‌ను అనుమతించని కారణంగా బిడ్డకు అమెరికా పౌరతస్వం పొందే అవకాశం కోల్పోతాడు.  

Updated Date - 2021-11-26T02:10:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising