ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడో డోసు మంచిదే.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఫైజర్ కంపెనీ

ABN, First Publish Date - 2021-07-29T10:47:04+05:30

ప్రపంచంలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్‌పై మంచి ప్రభావం చూపుతున్న వ్యాక్సిన్ ఫైజర్. అయితే నెమ్మదిగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ప్రపంచంలో విజృంభిస్తున్న డెల్టా వేరియంట్‌పై మంచి ప్రభావం చూపుతున్న వ్యాక్సిన్ ఫైజర్. అయితే నెమ్మదిగా ఈ వ్యాక్సిన్ కూడా డెల్టా వేరియంట్ ముందు తలొంచుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. డెల్టా విజృంభణ ప్రారంభమై ఆరు వారాలు గడిచిన సందర్భంగా సైంటిస్టులు షాకింగ్ నిజాలు వెల్లడించారు. కరోనా మహమ్మారి తొలుత వెలుగు చూసినప్పుడు వైరస్‌పై ఫైజర్ 96శాతం ప్రభావశీలంగా ఉండగా.. ప్రస్తుతం డెల్టా వేరియంట్‌పై ఈ సామర్థ్యం 84శాతానికి పడిపోయింది. ఈ క్రమంలో ప్రజలకు మూడో డోస్ ఇస్తే ఎలా ఉంటుంది? అనే అంశంపై ఫైజర్ కంపెనీ పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో 65 నుంచి 85 సంవత్సరాల వయసు ఉన్న వారిలో మూడో డోసు వ్యాక్సిన్ అద్భుత ఫలితాలనిస్తోందని తేలింది. మూడో డోసు తీసుకున్న వారిలో యాంటీబాడీలు 11రెట్లు పెరిగాయట. ఈ క్రమంలో మూడో డోసు ఇవ్వడానికి అత్యవసర అనుమతుల కోసం ఈ కంపెనీ ఆగస్టులోనే దరఖాస్తు చేసుకునే యోచనలో ఉందని తెలుస్తోంది. అలాగే ప్రధానంగా డెల్టా వేరియంట్‌పై పనిచేసే వ్యాక్సిన్‌ను తయారు చేయడానికి కూడా ఈ కంపెనీ ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం.

Updated Date - 2021-07-29T10:47:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising