ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దొంగిలించిన కారులో పసిబిడ్డ ఉందని తెలిసి.. అమెరికాలో..

ABN, First Publish Date - 2021-01-24T15:27:37+05:30

దొంగతనం అనేది తప్పు. కానీ.. దొంగతనం చేసే వారిలో కూడా మానవత్వం ఉండొచ్చు. అమెరికాలో చోటుచేసుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరెగాన్: దొంగతనం అనేది తప్పు. కానీ.. దొంగతనం చేసే వారిలో కూడా మానవత్వం ఉండొచ్చు. అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఘటనే అందుకు ఉదాహరణ. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని ఆరెగాన్ రాష్ట్రంలో ఓ దొంగ గ్రాసరీ స్టోర్ ముందు ఉన్న కారును దొంగిలించాడు. కొంత దూరం వెళ్లిన తరువాత కారు వెనుక సీటులో పసిబిడ్డ ఉన్న విషయాన్ని గుర్తించాడు. అంతే.. వెంటనే కారును దొంగిలించిన ప్రదేశానికి మళ్లీ వెళ్లాడు. ‘పసిబిడ్డను కారులో వదిలేస్తావా.. బిడ్డకు ఏమైనా అయితే ఏంటి పరిస్థితి?’ అంటూ బిడ్డ తల్లి, కారు యజమానిని మందలించాడు. బిడ్డను తల్లి చేతిలో పెట్టి మళ్లీ అదే కారులో వెళ్లిపోయాడు. 


నిజానికి మహిళ కారుకు 15 అడుగుల దూరంలోనే ఉంది. కారు ఇంజిన్ ఆఫ్ చేయకుండా బయటకు దిగడంతో దొంగ ఒక్కసారిగా కారెక్కి అక్కడి నుంచి పరారయ్యాడు. కాగా.. మహిళ జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు కొద్ది గంటల్లోనే కారును కనిపెట్టారు. అయితే నిందితుడు మాత్రం పరారయ్యాడని, అతడిని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పారు. నిందితుడి ఆచూకీ తెలిసిన వారు తమకు సమాచారం అందించాలంటూ అధికారులు నిందితుడి నమూనా ఫొటోను విడుదల చేశారు.

Updated Date - 2021-01-24T15:27:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising