ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరల్ న్యూస్: యూఏఈలో విజిట్ వీసాదారులకూ కొవిడ్ టీకా.. ఇది నిజమేనా?

ABN, First Publish Date - 2021-04-29T22:54:32+05:30

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో యూఏఈలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘విజిట్ వీసాదారులకు కూడా యూఏఈ ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సిన్‌ను ఆఫర్ చేస్తోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుధాబి: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో యూఏఈలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘విజిట్ వీసాదారులకు కూడా యూఏఈ ప్రభుత్వం కొవిడ్ వ్యాక్సిన్‌ను ఆఫర్ చేస్తోంది. రాస్ అల్ ఖైమా‌లోని ప్రభుత్వ టీకా కేంద్రానికి వెళ్తే ఎటువంటి ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా విజిట్ వీసాదారులు కొవిడ్ టీకాను పొందొచ్చు’ అనే సందేశం యూఏఈలోని వాట్సప్ గ్రూపుల్లో హల్‌చల్ చేస్తోంది. ఇది నిజమే అని నమ్మి.. చాలా మంది విజిట్ వీసాదారులు రాస్ అల్ ఖైమా‌లోని టీకా కేంద్రానికి క్యూ కడుతున్నారు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత ‘విజిట్ వీసాదారులకు ప్రస్తుతం వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. యూఏఈ పౌరులు, నివాసితులకు మాత్రమే టీకా అందిస్తున్నాం’ అనే మాటలను సిబ్బంది నోటి నుంచి విని నిరాశతో వెనుదిరుగుతున్నారు. 


తాజాగా భారత్‌కు చెందిన మన్మోహన్ సింగ్, సతీందర్ కౌర్ దంపతులకు ఇటువంటి చేదు అనుభవమే ఎదురైంది. మన్మోహన్ సింగ్, సతీందర్ కౌర్ దంపతులు కొన్ని నెలల కింద విజిట్ వీసాపై ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్లారు. తాజాగా వ్యాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న ఫేక్ న్యూస్‌ను నిజమే అని నమ్మి.. రాస్ అల్ ఖైమా‌లోని ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లారు. అనంతరం ‘విజిట్ వీసాదారులకు ప్రస్తుతం టీకా వేయడం లేదని, త్వరలోనే అందుబాటులోకి తెస్తాం’ అని అక్కడి సిబ్బంది చెప్పడంతో ఆ దంపతులు నిరాశతో వెనక్కి వచ్చేశారు. మన్మోహన్ సింగ్ తనకు ఎదురైన అనుభవాన్ని మీడియా వివరిస్తూ.. ‘నా స్నేహితుల్లో చాలా మందికి రెసిడెంట్ వీసాలు ఉన్నాయి. వారందరికీ యూఏఈ ప్రభుత్వం వీసాలు అందజేసింది. ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దుబాయిలోనే ఇంకొన్ని రోజులు ఉండాలని అనుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు. 


Updated Date - 2021-04-29T22:54:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising