ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలిఫోర్నియాలో దావానలం బీభత్సం..!

ABN, First Publish Date - 2021-08-07T15:36:12+05:30

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. దావానలం బీభత్సానికి గ్రీన్​విల్లే విలవిల్లాడుతోంది. గ్రీన్​విల్లే ప్రాంతంలో చర్చి, గ్యాస్​ స్టేషన్, హోటల్, మ్యూజియం, బార్లు సహా ఏళ్ల నాటి ఇళ్లు కార్చిచ్చు ధాటికి దగ్ధమయ్యాయి. దీంతో గ్రీన్​విల్లే పరిసర ప్రాంత ప్రజలను తమ నివాసాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. అటు మౌంటెన్ నగరం కూడా మంటలకు ఆహుతైంది. దీంతో వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. జులై 14న కాలిఫోర్నియాలో మొదలైన ఈ కార్చిచ్చు అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు సుమారు 13 రాష్ట్రాలకు విస్తరించింది. దాదాపు 1,305 కిలోమీటర్ల మేర వ్యాపించినట్లు అగ్నిమాపక శాఖ వెల్లడించింది.



ఇక ప్లుమాస్​ కౌంటీలో శరవేగంగా వ్యాప్తిస్తున్న మంటల ధాటికి భారీగా భవనాలు, వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఫ్లుమాస్‌తో పాటు టైలర్స్​విల్లే కౌంటీ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కొన్ని చదరపు కిలోమీటర్ల మేర దావానలం వ్యాపించింది. మంటలు భారీగా ఎగసిపడుతుండడంతో ఆకాశాన్ని దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. హాలీవుడ్ సినిమాల్లో చూపించిన మాదిరిగా గ్రామాలకు గ్రామాలను దహించివేస్తున్న కార్చిచ్చు దృశ్యాలు అత్యంత భీతిగొలిపేలా ఉన్నాయి. సుమారు 20వేల మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, కాలిఫోర్నియా చరిత్రలో ఇది మూడో అతిపెద్ద దావానలం అని అధికారులు పేర్కొన్నారు.   





Updated Date - 2021-08-07T15:36:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising