ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో భారత సంతతి యువతికి బ్రెయిన్ డెడ్.. డిక్లేర్ చేసిన వైద్యులు.. కారణం ఏంటంటే..

ABN, First Publish Date - 2021-11-10T23:17:07+05:30

అగ్రరాజ్యం అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. అస్ట్రోవరల్డ్ ఫెస్టివల్‌లో జరిగిన తొక్కిసలాటలో సుమారు 8 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో భారత్‌కు చెందిన భారతి షహాని కూడా తీవ్రంగా గాయపడగా.. వై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. అస్ట్రోవరల్డ్ ఫెస్టివల్‌లో జరిగిన తొక్కిసలాటలో సుమారు 8 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో భారత్‌కు చెందిన భారతి షహాని కూడా తీవ్రంగా గాయపడగా.. వైద్యులు పరీక్షించి ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్ధారించారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


హ్యూస్టన్‌లోని ఎన్ఆర్జీ పార్క్‌లో నవంబర్ 5న ఆస్ట్రోవరల్డ్ ఫెస్టివల్-2021 పేరుతో మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ర్యాప్‌ సింగర్ ట్రావిస్ స్కాట్, డ్రేక్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది తరలి వెళ్లారు. భారత్‌కు చెందిన భారతి షహాని కూడా తన సోదరి నమ్రతా షహాని, కజీన్ మోహిత్‌‌తో కలిసి మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రముఖ ర్యాప్ సింగర్ ట్రావిస్ స్కాట్.. స్టేజిపైకి చేరుకున్న వెంటనే జనం ఒక్కసారిగా స్టేజిపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.



ఈ క్రమంలోనే భారతి షహాని కింద పడిపోయి.. తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమెకు వైద్యులు తొలుత సీపీఆర్ అందించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్ ఇచ్చిన వైద్యులు.. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఈ సందర్భంగా భారతి షహాని తండ్రి మాట్లాుడతూ.. తన కూతురు బతికే అవకాశాలు లేవని వైద్యులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. 22ఏళ్ల భారతి షహాని టెక్సాస్ అగ్రికల్చర్ అండ్ మెకానికల్ యూనివర్సిటిలో చదువుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. దీనిపై ట్రావిస్ స్కాట్ స్పందించారు. ఆ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


Updated Date - 2021-11-10T23:17:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising