ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెక్సాస్ స్కూల్‌కు భారతీయ అమెరికన్ మహిళ పేరు

ABN, First Publish Date - 2021-03-31T17:45:10+05:30

విద్య, సేవ కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు పొందిన భారతీయ అమెరికన్ మహిళ సోనాల్ భూచార్‌కు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అరుదైన గౌరవం దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హ్యూస్టన్: విద్య, సేవ కార్యక్రమాల ద్వారా మంచి గుర్తింపు పొందిన భారతీయ అమెరికన్ మహిళ సోనాల్ భూచార్‌కు అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో అరుదైన గౌరవం దక్కింది. అక్కడ ప్రారంభించబోయే ఓ ఎలిమెంటరీ స్కూల్‌కు సోనాల్ పేరును పెట్టేందుకు ఫోర్ట్ బెండ్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్(ఎఫ్‌బీఐఎస్‌డీ) బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఏకగ్రీవంగా అంగీకరించారు. 2019లో 58వ యేటా క్యాన్సర్‌తో చనిపోయిన సోనాల్‌కు ఆమె మరణానంతరం ఎఫ్‌బీఐఎస్‌డీ ఈ అరుదైన గౌరవంతో సత్కారించాలని నిర్ణయించింది. కాగా, ఈ ఎలిమెంటరీ స్కూల్ 2023 జనవరిలో రివర్‌స్టోన్‌లో ప్రారంభం కానుంది. ఇక ముంబైకి చెందిన సోనాల్ తన భర్త సుబోధ్ భూచార్‌తో కలిసి 1984లో హ్యూస్టన్‌కు వలస వెళ్లారు. ఫిజియోథెరపిస్ట్ అయిన సోనాల్ చాలా సంవత్సరాలు అక్కడే వైద్యసేవలు అందించారు. దాంతో తన సేవ కార్యక్రమాల ద్వారా అనతికాలంలోనే ఆమె ప్రజా సంఘ కార్యకర్తగా గుర్తింపు పొందారు. అనంతరం ఎఫ్‌బీఐఎస్‌డీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా ఎన్నికై ఆరేళ్లు పని చేశారు. ఆ తర్వాత బోర్డ్ అధ్యక్షురాలిగా రెండేళ్లు సేవలు అందించారు. 2015లో టెక్సాస్ గవర్నర్ జార్జి అబ్బాట్ ఆమెను వన్ స్టార్ నేషనల్ సర్వీస్ కమిషన్ బోర్డుకు అపాయింట్ చేయడం విశేషం.    

Updated Date - 2021-03-31T17:45:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising