ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం.. తల్లిదండ్రుల పిలుపుతో వచ్చి.. కరోనా కాటుకు యువతి బలి!

ABN, First Publish Date - 2021-06-18T05:01:09+05:30

అమెరికాలో మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. మంచి ఆదాయం. తల్లిదండ్రులు ఇంటికి రమ్మంటే స్వదేశానికి వచ్చిందా యువతి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామగుండం: అమెరికాలో మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. మంచి ఆదాయం. తల్లిదండ్రులు ఇంటికి రమ్మంటే స్వదేశానికి వచ్చిందా యువతి. అలా వచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ (రామగుండం)లో కృష్ణనగర్‌కు చెందిన ఒక కాంట్రాక్టర్ ఉన్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు నరిష్మారెడ్డి (27) అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి నాలుగేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఇంటికి రావాలని తల్లిదండ్రులు నరిష్మారెడ్డిని ఇంటికి పిలిపించారు. అలా నెలరోజుల క్రితం స్వదేశానికి వచ్చిన నరిష్మా.. 20 రోజుల క్రితం అనారోగ్యం పాలైంది. కరోనా సోకినట్లు తేలింది. ఆమె తల్లికీ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వారం రోజుల కిందట నరిష్మాకు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ ఫలితం వచ్చింది. కానీ ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరిష్మ కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం కమ్ముకుంది. ‘‘అమెరికాలోనే ఉన్నా బతికేదానికి తల్లీ.. అనవసరంగా మా కోసం వచ్చి కరోనాకు బలైపోయావు’’ అంటూ ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

Updated Date - 2021-06-18T05:01:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising