ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్ఫ్‌లో తెలుగు ప్రవాసీయుల ఈస్టర్ ప్రార్థనలు

ABN, First Publish Date - 2021-04-06T05:12:35+05:30

గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రవాసీయులు ఆదివారం రాత్రి ఈస్టర్ ప్రార్థనలను అత్యంత భక్తిశ్రధ్ధలతో కోవిడ్ నిబంధనల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రవాసీయులు ఆదివారం రాత్రి ఈస్టర్ ప్రార్థనలను అత్యంత భక్తిశ్రధ్ధలతో కోవిడ్ నిబంధనల మధ్య సామాజిక దూరం పాటిస్తూ నిర్వహించారు.


షార్జా, ఆబుధాబి నగరాలలో కూడా తెలుగులో కార్యక్రమాలు జరిగాయి. ​సౌదీ అరేబియాలో జెద్ధాలోని గ్లోరియస్ తెలుగు చర్చిలో జరిగిన కార్యక్రమంలో సంఘ కాపరి హునుక్ అభినయ్ శుభ శిలువ శ్రమను, శిలువ మరణము, పునరుత్థానం గూర్చి వివరించారు.


వేదనలో ఉన్న తోటి మానవుని జీవితంలో సంతోషం నింపడమే అసలు విశ్వాసమని, అందుకు అందరు కృషి చేయాలని అన్నారు. అరుణా, రెబెకా, రోజా పాడిన కీర్తనలు భక్తులను ఆలరింపజేయగా బ్రదర్ అనిల్ కుమార్ చేసిన ముగింపు ప్రార్థనలు అత్యాధ్మికతను ప్రతిబింబజేశాయి.


దుబాయిలోని సి.యస్.ఐ చర్చిలో తెలుగులో జరిగిన కార్యక్రమంలో క్రీస్తు ప్రభువు పునరుత్థానం గూర్చి పాస్టర్లు విక్టర్ ప్రేంకుమార్, స్టెఫన్ డానీయల్ వివరించారు. 



Updated Date - 2021-04-06T05:12:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising