ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌కు తెలుగు దేశం కువైట్ ఘన నివాళి

ABN, First Publish Date - 2021-01-20T18:39:45+05:30

తెలుగువారి ఆరాధ్య దైవం, మహనీయుడు నందమూరి తారక రామారావు 25వ వర్దంతిని పురస్కరించుకుని కువైట్‌లోని తెలుగు దేశం అధ్యక్షులు కుదర వల్లి సుధాకరరావు ఆధ్వర్యములోఅన్న గారికి ఘనంగా నివాళులర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగువారి ఆరాధ్య దైవం, మహనీయుడు నందమూరి తారక రామారావు 25వ వర్దంతిని పురస్కరించుకుని కువైట్‌లోని తెలుగు దేశం అధ్యక్షులు కుదర వల్లి సుధాకరరావు ఆధ్వర్యములోఅన్న గారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బముగాఎర్పాటు చేసిన కార్యక్రమములో పలువురు తెలుగు దేశం నాయకులు పాల్గొని అన్నగారిని స్మరించుకున్నారు. సుధాకరరావు మాట్లాడుతూ ఆంధ్రుల ఆరాధ్యదైవం భౌతికముగా మనకు దూరమై నేటికి 25 సంవత్సరాలు అయినప్పటికి ఆయన ప్రతి తెలుగువాడి గుండెల్లో చిరస్మరణీయుడని, పేద బడుగు బలహీనవర్గాల కోసం తెలుగు దేశం పార్టీని స్థాపించి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా దేశ చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చంద్రన్న తెలుగుదేశం పార్టీని పేదల పార్టీగా నిలబెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ సేవాసమితి కార్యవర్గ సభ్యులకు తెలుగు దేశం కువైట్ బీసీ, ఎస్సీ, మైనారిటీ విభాగం, చంద్రన్న దళం, జైనారా లోకేష్ అందరికి సుధాకర రావు ధన్యవాదాలు తెలియచేశారు.


అనంతరం పీఆర్ఓ మద్దిన ఈశ్వర్ నాయుడు మాట్లాడుతూ ప్రతిఒక్క ప్రవాస తెలుగు దేశం కార్యకర్త సోషల్ మీడియాలోముందుకు వచ్చి ప్రస్తుత ప్రభుత్వ దురాగతాలను ప్రశ్నించాలని కోరారు.  అధికార ప్రతినిధి బోయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం గత 18 నెలల్లో లక్షాయాభై వేల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని నిలువునా ముంచేస్తున్నారన్నారు. ఒక రాజధానినే కట్టడానికి నిధులు సమకూర్చలేక మూడు రాజధానులు అని నాటకాలు ఆడుతూ ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని దుయ్యబట్టారు. మరో అధికార ప్రతినిధి నాయని పాటి విజయ్ ట్లాడుతూ అన్న గారిని ప్రతి తెలుగోడు ఆదర్శముగా తీసుకోవాలని, ఆయన ప్రజల కోశం పుట్టిన మనిషి అని అన్నారు. ప్రోగ్రాం కన్వీనర్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ అన్నగారికి భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏను గొండ నరసింహులు, చుండు బాల రెడ్డయ్య, గంటా గోపి, సుభాన్, ఖాద్సియా నరసింహ, రమేష్, వంశి, మంచూరి శివ, జనార్దన్ రెడ్డి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.  






Updated Date - 2021-01-20T18:39:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising