ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లండన్‌లో అంగరంగ వైభవంగా బతుకమ్మ, సంబరాలు

ABN, First Publish Date - 2021-10-12T23:10:22+05:30

తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో లండన్ బతుకమ్మ, దసరా సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో లండన్ బతుకమ్మ, దసరా సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఏడాది కూడా యూరోప్‌లోనే అతిపెద్ద  బతుకమ్మ నిర్వహించి చరిత్ర సృష్టించారు. కోవిడ్ ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వ నియమాల ప్రకారం ఈ సంబరాలకు ఏర్పాట్లు చేశారు. దీంతో 1500 మందికి పైగా మహిళలు బతుకమ్మ ఆటలో పాల్గొని విజయవంతం చేశారు. మొదట దుర్గా అమ్మవారి పూజతో ప్రారంభమైందీ కార్యక్రమం. అనంతరం భారత్ నుంచి ప్రత్యేకంగా తెచ్చిన జమ్మి చెట్టుకు పూజ నిర్వహించారు. ఆ తర్వాత బతుకమ్మ ఆట, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు ధూంధాంగా జరిగాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన లండన్ డిప్యూటీ మేయర్ రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ భారత దేశ సంస్కృతిని చాటడం, కళలను ప్రోత్సహించడంపై అభినందనలు తెలిపారు. పువ్వులనే దేవతగా పూజించి, ప్రకృతి పూజ చేయడాన్ని కొనియాడారు.


ముఖ్య అతిథిగా విచ్చేసిన లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ఎన్నారైలపై ఉందన్నారు. తొమ్మిదేళ్లుగా బతుకమ్మ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసినందుకుగాను తెలంగాణకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మరో లండన్ ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ వేల మంది మహిళలు ఒక్క చోట కలిసి పండుగ చేసుకోవడం చాలా అరుదు అంటూ, బతుకమ్మలో భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. లండన్‌లో హిందూ పండుగలను నిర్వహించడం, సంప్రదాయాలను సజీవంగా ఉంచడంపై స్థానిక మేయర్ బిష్ణు సంతోషం వ్యక్తం చేశారు.


అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ మాట్లాడుతూ యూరోప్‌లోనే అతి పెద్ద బతుకమ్మ నిర్వహణ బాధ్యతకు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. సిద్ధిపేట గొల్లభామ, చేనేత, ఫిలిగ్రి, పెంబర్తి ఇత్తడి, నిర్మల్ బొమ్మలను వివిధ దేశాల్లో ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. అందరు సహకరించి తెలంగాణ కళల పటిష్టతకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ప్రధాన కార్యదర్శి, ఇంజార్జ్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ 2017 నుంచి ప్రతియేటా అతిపెద్ద బతుకమ్మ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మళ్లీ ఈ ఏడాది చరిత్ర తిరగరాసి అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి చరిత్ర సృష్టించిన ఘనత తెలంగాణ ఎన్నారై ఫోరమ్ సభ్యులదేనని అన్నారు.


వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి గంగసాని ప్రవీణ్ రెడ్డి, రంగు వెంకట్, కార్యదర్శి మహేష్ జమ్మల, వెంకట్ స్వామి, బాలకృష్ణ రెడ్డి, మహేష్ చాట్ల, నరేంద్ర వర్మ, స్వామి ఆశ రాజు కొయ్యడ, ఆకుల శ్రీనివాస్, వెంకట్ రెడ్డి ఈ సంబరాలు విజయవంతం కావడంలో కీలకంగా వ్యవహరించారు. మహిళా విభాగం మీనా అంతటి, వాణి అనసూరి, శౌరి గౌడ్, జయశ్రీ, సవిత జమ్మల, దివ్య, అమృతలు బతుకమ్మ నిర్వహణలో కీలకంగా పని చేసి విజయవంతం చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు బతుకమ్మ ఆట, కట్టే  కోలాటం ఆడి అనంతరం నిమజ్జనం చేసిన తర్వాత అందరికి విందు ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-10-12T23:10:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising