ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీమ్‌ బైడెన్‌.. భారతీయుల డెన్‌

ABN, First Publish Date - 2021-01-18T13:09:30+05:30

మరో రెండ్రోజుల్లో కొలువుదీరనున్న జో బైడెన్‌ ప్రభుత్వం అనేక అంశాల్లో విశిష్టత సంతరించుకోబోతోంది. వీటిలో ఒకటి పెద్ద సంఖ్యలో భారత సంతతి వ్యక్తులు శ్వేతసౌధంలో, కీలక ప్రభుత్వ పదవుల్లో నియమితులు కావడం. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా 20 మంది భారతీయ-అమెరికన్లు బైడెన్‌ బృందం లో ముఖ్యమైన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

20 మంది ఇండియన్లకు కీలక పదవులు

అగ్రరాజ్య చరిత్రలో ఇదే తొలిసారి


స్పీచ్‌ డైరెక్టర్‌ వినయ్‌ రెడ్డి.. బైడెన్‌ వెలువరించే ప్రసంగాలన్నింటినీ పకడ్బందీగా రాసే బాధ్యత ఈయనది. స్పీచ్‌ డైరెక్టర్‌గా బైడెన్‌ ఆయనను నియమించారు.


వాషింగ్టన్‌, జనవరి 17: మరో రెండ్రోజుల్లో కొలువుదీరనున్న జో బైడెన్‌ ప్రభుత్వం అనేక అంశాల్లో విశిష్టత సంతరించుకోబోతోంది. వీటిలో ఒకటి పెద్ద సంఖ్యలో భారత సంతతి వ్యక్తులు శ్వేతసౌధంలో, కీలక ప్రభుత్వ పదవుల్లో నియమితులు కావడం. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా 20 మంది భారతీయ-అమెరికన్లు బైడెన్‌ బృందం లో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ భారతీయ మూలాలున్నవారే. ఆమెనే కాక- తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే భారతీయ సంతతికి చెం దిన ప్రముఖులను తన బృందంలోకి తీసుకుంటానని బైడెన్‌ గతంలోనే వెల్లడించారు. అగ్రశ్రేణి పదవులకు ఎంపికైన ప్రముఖుల్లో నీరా టాండన్‌ ఒకరు. ఈమె ఆఫీస్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ బడ్జెట్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 1988 నుంచి 2016 దాకా ప్రతీ డెమొక్రాట్‌ అధ్యక్ష అభ్యర్థి ప్రచారంలోనూ ఆమెది కీలకపాత్ర. డెమొక్రాట్‌ ప్రభుత్వాల్లో విధానపరమైన సలహాదారుగా కేపిటల్‌  హిల్‌లో పనిచేసిన విశేషానుభవం ఉన్న వ్యక్తి. ఇక బైడెన్‌ ఎంపిక చేసుకున్న వ్యక్తి డాక్టర్‌ వివేక్‌ మూర్తి. అమెరికా సర్జన్‌ జనరల్‌గా నియమితులవుతున్నారు. ఆరోగ్యరంగ నిపుణుడిగా ఆయన వ్యాక్సినేషన్‌ విషయంలో దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కొవిడ్‌ టెస్టింగ్‌ వి భాగం వ్యవహారాలను చూసే  బాధ్యతను డాక్టర్‌ విదుర్‌ శర్మకు అప్పగించారు. బైడెన్‌ వెలువరించే ప్రసంగాలన్నింటినీ పకడ్బందీగా రాసే బాధ్యత వినయ్‌రెడ్డిది. స్పీచ్‌ డైరెక్టర్‌గా ఆయన నియమితులయ్యారు. అధ్యక్ష సిబ్బంది కార్యాలయ డిప్యూ టీ డైరెక్టర్‌గా గౌతమ్‌ రాఘవన్‌ ఎంపికయ్యారు.






Updated Date - 2021-01-18T13:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising