ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒలింపిక్స్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపిన టాక్ స్పోర్ట్స్ సెక్రటరీ

ABN, First Publish Date - 2021-08-06T01:31:37+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్ ) స్పోర్ట్స్ సెక్రటరీ రాకేష్ పటేల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ భారతీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: టోక్యో  ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్ ) స్పోర్ట్స్ సెక్రటరీ రాకేష్ పటేల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ భారతీయుడు గర్వపడేలా టోక్యో ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. ముఖ్యంగా 41 సంవత్సరాల తరువాత హాకీలో భారత్ పతకం సాధించడం సంతోషాన్నిచ్చిందన్నారు. భవిష్యత్తు తరాలవారికి హాకీ టీం స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసించారు. 



అలాగే పీవీ సింధు విజయం సైతం భారత ఖ్యాతిని పెంచిందన్నారు. ఆడపిల్లల్లో నూతన స్ఫూర్తిని నింపారని రాకేష్ పటేల్ సంతోషం వ్యక్తం చేశారు. విజేతలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పారితోషికాన్ని ప్రకటించి, భవిష్యత్తులో వారు మరిన్ని పతకాలు సాధించేలా ప్రోత్సహించాలని కోరారు. అంతేకాకుండా వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. అలాగే పతకాలు సాధించడంలో తీవ్రంగా శ్రమించి, ఓటమిని ఎదుర్కొన్న క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం నింపాలని ప్రభుత్వాలను కోరారు. 


Updated Date - 2021-08-06T01:31:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising