ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబరాలు

ABN, First Publish Date - 2021-11-14T20:09:28+05:30

తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్(టాస్).. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించింది. స్కాట్లాండ్ తెలుగు ప్రజల సమక్షంలో క్రమండ్ కిర్క్ హాల్, ఇడిన్‌బరోలో జరిగిన ఈ కార్యక్రమంలో వయోభేదం లేకుండా అంతా ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్(టాస్).. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించింది. స్కాట్లాండ్ తెలుగు ప్రజల సమక్షంలో క్రమండ్ కిర్క్ హాల్, ఇడిన్‌బరోలో జరిగిన ఈ కార్యక్రమంలో వయోభేదం లేకుండా అంతా ఆనందంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్‌లో ఉన్న తెలుగు వారు, పలు భాషలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. టాస్ ఛైర్మన్ మైధిలి కెంబూరి ప్రసింగిస్తూ కొవిడ్-19 తర్వాత తెలుగు వారి మధ్య ఘనంగా పండుగను జరుపుకోవడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్కాట్లాండ్‌లో ఉన్న తెలుగు ప్రజలకు ఆమె దీపావళఇ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అధ్యక్షులు శివ చింపిరి ప్రసంగించారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు టాస్ చేసిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన అందరికీ వివరించారు. అలాగే పూర్వ కమిటీ సభ్యులకు, వాలంటీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిరంజన్ మాట్లాడుతూ.. టాస్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆదరిస్తున్న తెలుగు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమములను మున్ముందు ఇంకా ఘనంగా జరుపుకోవాలి అని ఆకాంక్షించారు. చివరగా జనరల్ సెక్రటరీ ఉదయ్ కుమార్ కూచవడి మాట్లాడుతూ.. కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపి, జాతీయగీతంతో కార్యక్రమానికి ముగింపు చెప్పారు. 




Updated Date - 2021-11-14T20:09:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising