ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ప్రారంభమైన 'తానా' గ్రంథాలయం

ABN, First Publish Date - 2021-10-03T13:20:28+05:30

తానా ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గ్రంథాలయం చాలా అట్టహాసంగా ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్జీనియా: తానా ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన గ్రంథాలయం చాలా అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చిన్నారులు మహిళలు పాల్గొన్నారు. సుమారు వెయ్యికి పైగా పుస్తకాలతో వర్జీనియా తెలుగు ప్రజలకి అందుబాటులో ఉండటంపై కార్యక్రమానికి హాజరైన పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తానా పూర్వపు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ డా. హేమ ప్రసాద్ యడ్ల తానా సజీవ చరిత్ర(నరిశెట్టి ఇన్నయ్య రచించిన) పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు వారికి ప్రత్యేక గ్రంథాలయం 40 ఏళ్ళ కల అని, దానిని వాస్తవ రూపంలోకి తీసుకు వచ్చిన తానా కాపిటల్ రీజియన్ సభ్యులందరినీ  ప్రత్యేకంగా అభినందించారు. వర్జీనియా, మేరీల్యాండ్, వాషింగ్టన్ డి.సిలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


తానా రీజినల్ కోఆర్డినేటర్ ఉయ్యురు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ గ్రంథాలయం ప్రతి రోజూ అందుబాటులో ఉంటుందన్నారు. వీకెండ్‌లో చిన్నారులు, పెద్దలకు పుస్తక పఠనం, కథా చర్చలు తదితర ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. దీంతోపాటు చిన్నారులకి ప్రత్యేకంగా గ్రూప్ డిస్కషన్, ఇన్డోర్ గేమ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇది తొలి అడుగు మాత్రమేనని, మున్ముందు మరిన్ని వినూత్న కార్యక్రమాలు, వసతులు తెలుగు వారికి అందుబాటులోకి తీసుకువస్తామని దీనికి మీ అందరి సహాయ సహకారాలు కావాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.


భావితరపు తెలుగు యువత, మహిళలు ఈ గ్రంథాలయం నిర్వహణకు స్వచ్ఛందంగా తమవంతు సహకారం అందించడానికి ముందుకు రావటం విశేషం. అన్ని తరాలకు అనుసంధాన వేదికగా ఈ ప్రాంగణం ఉపయోగపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించటానికి సహకరించిన పలు ప్రాంతీయ తెలుగు సంస్థల ప్రతినిధులకి, విచ్చేసిన తెలుగు సాహితి ప్రియులకి, చిన్నారులకి, మహిళలకు తానా గ్రంధాలయ నిర్వాహకులు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించిన కాపిటల్ రీజియన్ తానా ప్రతినిధులకు, తెలుగు సాహితి ప్రేమికులకు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు తానా లీడర్ షిప్ తరుపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.









Updated Date - 2021-10-03T13:20:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising