ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్కంఠ భ‌రితంగా కొన‌సాగుతున్న‌ ‘తానా’ ఎన్నికల ఓట్ల లెక్కింపు..

ABN, First Publish Date - 2021-05-30T16:11:46+05:30

అమెరికాలో తెలుగు వారంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భ‌రితంగా కొన‌సాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్ట‌న్‌: అమెరికాలో తెలుగు వారంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న‌ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భ‌రితంగా కొన‌సాగుతోంది. సియాటెల్‌లోని స్థానిక ఎలక్షన్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో కౌంటింగ్‌ జరుగుతోంది. తానా ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా మొత్తం 408 లైవ్‌ ఓట్లు ఉండగా.. నిరంజన్‌ ప్యానెల్‌కు 233, నరేన్‌ కొడాలి ప్యానెల్‌కు 175 ఓట్లు వ‌చ్చాయి. తానా ఎన్నికల్లో మొత్తం ఓట్లు 33,875 ఉంటే.. ఈసారి 21 వేలు ఓట్లు పోలైన‌ట్లు తెలుస్తోంది. ఇక చెల్లని ఓట్లు 2,800 ఉన్నట్లుగా గుర్తించారు. సాయంత్రం వ‌ర‌కు తుది ఫలితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. రెండేళ్లకోసారి జ‌రిగే తానా ఎన్నిక‌ల్లో ఈసారి అధ్యక్ష ప‌దవికి ముగ్గురు అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. కానీ, ప్ర‌ధాన పోటీ మాత్రం నిరంజన్ శృంగవరపు, నరేన్‌ కొడాలి మ‌ధ్య‌నే ఉంది. ఇక నరేన్‌ కొడాలికి మద్దతుగా తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, సతీష్‌ వేమన ఉంటే.. శృంగవరపు నిరంజన్‌కు జ‌యశేఖ‌ర్‌ తాళ్లూరి, అంజయ్య చౌదరిలు మద్దతు తెలుపుతున్నారు.     

Updated Date - 2021-05-30T16:11:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising