ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తానా ఆధ్వర్యంలో ‘ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం 21’

ABN, First Publish Date - 2021-03-08T16:03:19+05:30

ఉగాది సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయిలో ‘తెలుగు మహాకవి సమ్మే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఉగాది సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయిలో ‘తెలుగు మహాకవి సమ్మేళనం 21’ అనే కార్యక్రాన్ని అంతర్జాలంలో నిర్వహిస్తున్నట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రకటించింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, సాహిత్య వేదిక సమన్వయకర్త, శత శతక కవి, చిగురుమళ్ల శ్రీనివాస్, తానా మహిళా విభాగపు సమన్వయకర్త శిరీష తూనుగుంట్ల నేతృత్వంలో తెలుగు సాహిత్య చరిత్రలోనే అపూర్వమైన రీతిలో ఈ కార్యక్రమం జరుగుతుందని తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ వెల్లడించారు. 


తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. 21 దేశాలలోని 21 తెలుగు సంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కవితాగానం, విశిష్ట అతిథుల సందేశాలతో, అంతర్జాల దృశ్య సాహిత్య సమావేశం నిర్విరామంగా 21 గంటల పాటు సాగుతుందని వెల్లడించారు. తెలుగు భాషా, సాహిత్యాలను ప్రోత్సహించటం, ప్రపంచంలోని తెలుగు కవులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి, ఒకే గొంతుగా తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ పేర్కొన్నారు. 


Updated Date - 2021-03-08T16:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising