ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తానా ఆధ్వర్యంలో ఆసక్తిగా సాగిన సాహిత్య కార్యక్రమం

ABN, First Publish Date - 2021-12-29T22:28:22+05:30

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాలంలో నిర్వహించిన “ప్రఖ్యాత సాహితీవేత్తలతో - ప్రత్యక్ష పరిచయాలు - ప్రత్యేక అనుభవాలు” అనే సాహిత్య కార్యక్రమం ఎంతో ఆసక్తిగా సాగింది. ఈ కార్యక్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో అంతర్జాలంలో నిర్వహించిన “ప్రఖ్యాత సాహితీవేత్తలతో - ప్రత్యక్ష పరిచయాలు - ప్రత్యేక అనుభవాలు” అనే సాహిత్య కార్యక్రమం ఎంతో ఆసక్తిగా సాగింది. ఈ కార్యక్రమంలో.. జ్ఞానపీఠ  అవార్డు గ్రహీత, పద్మభూషణ్ కవిసమ్రాట్ డా. విశ్వనాథ సత్యనారాయణ, ప్రముఖ దర్శకుడు డా. ఆచార్య ఆత్రేయ, మహాకవి శ్రీశ్రీ; సుప్రసిద్ధ సినీ గీత రచయిత, సిరివెన్నెల సీతారామశాస్త్రి సృష్టించిన సాహిత్యం గురించి కాకుండా వారి వారి జీవితాలలోని అనేక మలుపులను, స్పూర్తిదాయకమైన వారి జీవనయానాన్ని వారితో ప్రత్యక్ష పరిచయాలున్న పలువురు ప్రముఖలు ఆవిష్కరించారు.



తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు స్వాగాతోపన్యాసంలో విశిష్ట అతిథులందరినీ ఆహ్వానించి, సాహితీ చరిత్రలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, వేదిక సమన్వయ కర్త చిగురుమళ్ళ శ్రీనివాస్‌ను ప్రత్యేకంగా అభినందించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ‘ప్రముఖ సాహితీవేత్తల పేర్లు, వారు సృష్టించిన సాహిత్యం మాత్రమే మనకు తెలుస్తుంది. కానీ వారు ఎదుర్కొన్న అవరోధాలు, సవాళ్లు, కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన ఒత్తిళ్ళు వంటి వాటిని తట్టుకుని, సాహిత్య లోకంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న తీరు, వారు సృష్టించిన సాహిత్యం మానవాళికి ఎంతో స్పూర్తిదాయకం’ అన్నారు. 



ప్రముఖ అవధాని డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ యువకుడుగా ఉన్నప్పుడు డా.విశ్వనాథ సత్యనారాయణను తరచూ కలుస్తూ, ఆయనతో గడిపిన రోజులను, సాగించిన సంభాషణలను, చూసిన సన్నివేశాల గురించి విశదీకరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణ మాట్లాడుతూ.. విశ్వనాథ సత్యనారాయణతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు జే.కె. భారవి మాట్లాడుతూ.. ఆచార్య ఆత్రేయ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడ్డారని, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్న తీరు ఆసక్తిదాయకమన్నారు. సాహితీవేత్త డా. వంగూరి చిట్టెన్ రాజు మహాకవి శ్రీశ్రీ, సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన అనేక విషయాలను తెలిపారు. అదేవిధంగా యర్రంశెట్టి సత్యారావు మాస్టారు..  సిరివెన్నెల జీవితాన్ని, ముఖ్యంగా సినిమా రంగ ప్రవేశం ముందు జీవితాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించారు. ప్రముఖ కవి, వక్త, కిరణ్ ప్రభ సిరివెన్నెలతో తనకున్న ఇరవై సంవత్సరాల పైగా ఆత్మీయ అనుబంధాన్ని గురించి వివరించి చెప్పారు. 


Updated Date - 2021-12-29T22:28:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising