ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

International Flights పై మళ్లీ బ్యాన్ పొడిగింపు.. కానీ ఆ విమానాలు మాత్రం నడుస్తాయి!

ABN, First Publish Date - 2021-10-30T17:02:34+05:30

కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని భారత ప్రభుత్వం మరోసారి పొడిగించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై విధించిన నిషేధాన్ని భారత ప్రభుత్వం మరోసారి పొడిగించింది. నవంబర్ 30 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై బ్యాన్ కొనసాగుతుందని శుక్రవారం డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) వెల్లడించింది. అయితే, వందే భారత్ మిషన్, ఎయిర్ బబుల్ ఒప్పందం కింద నడుస్తున్న ప్రత్యేక ఇంటర్నెషనల్ విమాన సర్వీసులు యధావిధిగా పని చేస్తాయని డీజీసీఏ ప్రకటించింది. కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గతేడాది మార్చి 23 నుంచి భారత్ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2020 మే మొదటి వారం నుంచి వందే భారత్ మిషన్ తీసుకొచ్చింది. దీని ద్వారా ఎంపిక చేసిన దేశాల నుంచి విమాన సర్వీసులు నడిపిస్తోంది. 


అలాగే ఇదే ఏడాది జూలై నుంచి భారత్ కొన్ని దేశాలతో 'ఎయిర్ బబుల్' ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా, బ్రిటన్, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా సుమారు 28 దేశాలతో భారత ప్రభుత్వం ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. దీంతో ఆయా దేశాల నుంచి ఇండియాకు ప్రత్యేక నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలో విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా పొడిగించిన నిషేధం కారణంగా అంతర్జాతీయ కార్గో విమానాలతో పాటు ఇతర కొన్ని ఎమర్జెన్సీ సర్వీసులకు సంబంధించిన వాటిపై ఎలాంటి ప్రభావం ఉండబోదని డీజీసీఏ స్పష్టం చేసింది. 

Updated Date - 2021-10-30T17:02:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising