ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ టీకా తీసుకున్నా వీసాలు ఇవ్వరా?.. చైనాపై భారత్ ఆగ్రహం

ABN, First Publish Date - 2021-06-11T10:50:51+05:30

చైనా వ్యాక్సిన్ తీసుకుంటేనే విద్యార్థులు, నిపుణులకు వీసాలు ఇస్తామని చెప్పిన చైనా ఇప్పటికీ ఆ పని చేయకపోవడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము తయారు చేసిన టీకాను వేసుకుంటనే తిరిగి తమ దేశంలోకి అనుమతిస్తామని చైనా రాయబార కార్యాలయం మార్చిలో పేర్కొంది. చైనా జాతీయులు సహా ఇతరులు చైనా నుంచి నేరుగా భారత్‌‌లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చైనా వ్యాక్సిన్ తీసుకుంటేనే విద్యార్థులు, నిపుణులకు వీసాలు ఇస్తామని చెప్పిన చైనా ఇప్పటికీ ఆ పని చేయకపోవడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము తయారు చేసిన టీకాను వేసుకుంటనే తిరిగి తమ దేశంలోకి అనుమతిస్తామని చైనా రాయబార కార్యాలయం మార్చిలో పేర్కొంది. చైనా జాతీయులు సహా ఇతరులు చైనా నుంచి నేరుగా భారత్‌‌లో వచ్చేందుకు ప్రస్తుతం ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ అదే సమయంలో భారత్‌లో ఉన్న వారికి మాత్రం చైనా గతేడాది నవంబరు నుంచి వీసాలు జారీ చేయడం లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.  


చైనా తయారీ టీకా తీసుకున్న వారికి వీసాలు మంజూరు చేస్తామంటూ ఈ ఏడాది మార్చిలో చైనా రాయబార కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో చాలామంది భారతీయులు చైనా టీకాలు వేసుకుని వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికీ చైనా వీసాలు జారీ చేయడం లేదని, త్వరలోనే ఆ పని చేస్తుందని ఆశిస్తున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విషయంలో చైనాతో మాట్లాడుతున్నామని, త్వరలోనే భాతర్, చైనా మధ్య ప్రయాణాలు మొదలవుతాయని పేర్కొంది. ముఖ్యంగా అక్కడ చదువుకునేవారు, పని చేసేవారికి త్వరలోనే వీసాలు వస్తాయని అశాభావం వ్యక్తం చేసింది.


Updated Date - 2021-06-11T10:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising