ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని కరోనా వేరియంట్ల నుంచి స్పుత్నిక్ కాపాడుతుంది: రష్యా సైంటిస్టులు

ABN, First Publish Date - 2021-06-24T05:14:05+05:30

ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వేరియంట్లు అన్నింటిపైనా తమ వ్యాక్సిన్ పనిచేస్తుందని రష్యా సైంటిస్టులు అంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వేరియంట్లు అన్నింటిపైనా తమ వ్యాక్సిన్ పనిచేస్తుందని రష్యా సైంటిస్టులు అంటున్నారు. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తయారు చేసిన రష్యాలోని గామాలేయా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న కరోనా వేరియంట్లు అన్నింటినీ స్పుత్నిక్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అలెగ్జాండర్ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ మొత్తం భయపడుతున్న డెల్టా వేరియంట్‌పై కూడా స్పుత్నిక్ ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు. ‘‘స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత శరీరంలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల కరోనా వేరియంట్లను సమర్థవంతంగా నిలువరిస్తాయి. యూకేలో వెలుగు చూసిన ఆల్ఫా వేరియంట్ నుంచి భారత్‌లో బయటపడిన డెల్టా వరకూ ఏ వేరియంట్‌పై అయినా సరే స్పుత్నిక్ ప్రభావం చూపుతుంది’’ అని  పేర్కొన్నారు.

Updated Date - 2021-06-24T05:14:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising