ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులకు వీసాల జారీ ప్రక్రియపై బైడెన్‌కు సెనేటర్ల బృందం లేఖ

ABN, First Publish Date - 2021-08-09T03:30:50+05:30

అంతర్జాతీయ విద్యార్థులకు వీసాల జారీ అంశంపై బైడెన్ ప్రభుత్వానికి 24 మందితో కూడిన సెనేటర్ల బృందం లేఖ రాసింది. వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది. వీసాల ప్రక్రియ నత్తనడకన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అంతర్జాతీయ విద్యార్థులకు వీసాల జారీ అంశంపై బైడెన్ ప్రభుత్వానికి 24 మందితో కూడిన సెనేటర్ల బృందం లేఖ రాసింది. వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది. వీసాల ప్రక్రియ నత్తనడకన సాగడంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్‌కు రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాతో పోటీ పడుతున్న దేశాలు అంతర్జాతీయ విద్యార్థులకు, స్కాలర్లకు స్వాగతం పలుకుతున్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో అమెరికా కూడా కాన్సులర్ సేవలను విస్తృత పర్చాల్సిన అవసరం ఉందని చెప్పింది. వీసా అర్హతకు ఉన్న మినహాయింపులను పొడగించాలని సూచించింది. వర్చువల్ ఇంటర్వ్యూలు వంటి ప్రత్యామ్నాయాలను పెంచాలని అభిప్రాయపడింది. సిబ్బంది ఎక్కువ గంటలు పని చేస్తే.. ఎక్కువ సంఖ్యలో వీసాలను జారీ చేయెచ్చని తెలిపింది. దీనిపై దృష్టి పెట్టాలని కోరింది. కాగా.. బైడెన్ ప్రభుత్వానికి లేఖ రాసిన రెసేటర్ల బృందంలో రిపబ్లికన్ సెనేటర్లతో పాటు డెమొక్రటిక్ పార్టీకి చెందిన సెనేటర్లు కూడా ఉండటం విశేషం. ఇదిలా ఉంటే.. వీసాల జారీ ప్రక్రియను అమెరికా వేగవంతం చేస్తే.. భారతీయ విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. 


Updated Date - 2021-08-09T03:30:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising