ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dubai Expo 2020లో ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాద్‌ Startups

ABN, First Publish Date - 2021-11-12T13:11:31+05:30

దుబాయ్‌లో జరుగుతున్న ఎక్స్‌పో-2020లో హైదరాబాద్‌ నుంచి వెళ్లిన స్టార్ట్‌పలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): దుబాయ్‌లో జరుగుతున్న ఎక్స్‌పో-2020లో హైదరాబాద్‌ నుంచి వెళ్లిన స్టార్ట్‌పలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ దేశాల నుంచి వందల సంఖ్యలో స్టార్ట్‌పలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించగా.. మన దేశం నుంచి 500, తెలంగాణ నుంచి 14 స్టార్ట్‌పలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. నగరానికి చెందిన కౌస్తుబ్‌ స్టార్టప్‌ జర్స్‌ సేఫ్టీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తిచేసిన ఈయన ప్రపంచంలోనే తొలి ఏసీ హెల్మెట్‌ను అభివృద్ధి చేశారు. కరోనా వైరస్‌, ఎండ, వాయు కాలుష్యం నుంచి రక్షణ కల్పించే వస్ర్తాన్ని అభివృద్ధి చేసిన దీప్తి నాథల ఆవిష్కరణ ప్రత్యేకంగా నిలిచింది. హీకాల్‌ పేరుతో ఆమె స్టార్ట్‌పను ప్రారంభించారు. అలాగే.. ఇస్రోలో పనిచేసిన రాకెట్‌ ఇంజనీర్లు పవన్‌ కుమార్‌ చందన, నాగ భరత్‌ డాకాల స్కైరూట్‌, శ్రీకాంత్‌ రెడ్డి కలకొండ స్థాపించిన.. ఇంధన ద్విచక్ర వాహనాలను బ్యాటరీ వాహనాలుగా మార్చే హాలా మోబిలిటీ సందర్శకులను ఆకట్టుకొన్నాయి.

Updated Date - 2021-11-12T13:11:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising