ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవంతంగా ల్యాండ్ అయిందనుకునేలోపే.. ఒక్కసారిగా పేలిన స్పేస్‌ఎక్స్ రాకెట్

ABN, First Publish Date - 2021-03-04T13:15:11+05:30

ప్రముఖ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ సంస్థ స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్ రాకెట్ భూమిపై ల్యాండ్ అయిన కొద్ది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్సాస్: ప్రముఖ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ సంస్థ స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్ టెస్ట్ రాకెట్ భూమిపై ల్యాండ్ అయిన కొద్ది నిమిషాలకే పేలిపోయింది. టెక్సాస్‌లోని బొకా చికా ప్రాంతంలో బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం) స్టార్‌షిప్ ప్రొటోటైప్‌ ఎస్‌ఎన్‌10(సీరియల్ నెంబర్ 10)ను స్పేస్‌ఎక్స్ టెస్ట్ రన్ చేసింది. కొద్ది నిమిషాల తర్వాత రాకెట్ విజయవంతంగా భూమిపై తిరిగి ల్యాండ్ అయింది. రాకెట్ ల్యాండ్ అయిన వెంటనే ‘ఎ బ్యూటిఫుల్ సాఫ్ట్ ల్యాండింగ్’ అంటూ కామెంటేటర్ చెప్పారు. అయితే రాకెట్ ల్యాండ్ అయినప్పటికి మంటలు మాత్రం ఆగకపోవడంతో ఏదో జరగబోతోందని చాలా మంది ఊహించారు. వారంతా ఊహించిన విధంగానే రాకెట్ ఒక్కసారిగా పేలిపోయింది. 


ఎస్‌ఎన్10 ముందు ప్రవేశపెట్టిన ఎస్ఎన్9, ఎస్ఎన్8 ప్రొటోటైప్స్ కూడా ల్యాండింగ్ సమయంలో పేలిపోయాయి. తాజా ఘటనపై స్పేస్‌ఎక్స్ ఇంకా స్పందించలేదు. మరోపక్క ఎస్ఎన్11 ప్రొటోటైప్ కూడా ఇప్పటికే సిద్దమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఎస్ఎన్11ను కూడా స్పేస్‌ఎక్స్ టెస్ట్ చేయనుంది. కాగా.. మార్స్‌పైకి మనుషులను పంపడమే లక్ష్యంగా స్పేస్‌ఎక్స్ సంస్థ స్టార్‌షిప్ రాకెట్లను తయారుచేస్తోంది. 


Video Credits: VideoFromSpace

Updated Date - 2021-03-04T13:15:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising