ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పేస్ ఎక్స్ నిర్ణయంతో.. ఇస్రో రికార్డు పదిలం!

ABN, First Publish Date - 2021-01-24T07:59:05+05:30

ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ తీసుకున్న ఓ నిర్ణయంతో మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) రికార్డు పదిలంగా మిగిలింది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటో తెలుసా? ఓ మిషన్‌ను వాయిదా వేయడం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్పేస్ ఎక్స్ సంస్థ ట్రాన్స్‌పోర్టర్-1 పేరిట ఓ రాకెట్ లాంచ్ మిషన్ చేయాల్సి ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ తీసుకున్న ఓ నిర్ణయంతో మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) రికార్డు పదిలంగా మిగిలింది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటో తెలుసా? ఓ మిషన్‌ను వాయిదా వేయడం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్పేస్ ఎక్స్ సంస్థ ట్రాన్స్‌పోర్టర్-1 పేరిట ఓ రాకెట్ లాంచ్ మిషన్ చేయాల్సి ఉంది. ఈ నెల 24న ఈ రాకెట్ ప్రయోగం జరగాలి. కానీ కొన్ని అవాంతరాల వల్ల ఈ మిషన్‌ను వాయిదా వేస్తున్నట్లు స్పేస్ ఎక్స్ ప్రకటించింది. ఈ మిషన్‌లో భాగంగా 143 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపనుంది స్పేస్ ఎక్స్. ఇన్ని ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపడం ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకూ జరగలేదు. ఇప్పటి వరకూ ఈ రికార్డు మన ఇస్రో పేరిటే ఉంది. 2017లో పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ద్వారా భారత్.. 104 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. స్పేస్ ఎక్స్ ప్రయోగం గనుక అనుకున్న సమయానికి జరిగితే ఈ రికార్డు బద్దలయ్యేదే. కానీ ఈ ప్రయోగం వాయిదా పడటంతో మన ఇస్రో రికార్డు ఇంకా పదిలంగా మిగిలిందన్నమాట.

Updated Date - 2021-01-24T07:59:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising