ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సగం ఆస్తి చారిటీకే అన్న తండ్రి.. కొడుకులకు నచ్చకపోవడంతో.. సౌదీలో..

ABN, First Publish Date - 2021-01-25T14:39:50+05:30

తండ్రి, కొడుకుల మధ్య ఆస్తి పంపకం విషయంలోనే ఎక్కువగా తగాదాలు వస్తుంటాయి. సౌదీకి చెందిన ఓ కుటుంబంలోనూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబూధాబీ: తండ్రి, కొడుకుల మధ్య ఆస్తి పంపకం విషయంలోనే ఎక్కువగా తగాదాలు వస్తుంటాయి. సౌదీకి చెందిన ఓ కుటుంబంలోనూ ఇదే సమస్య వచ్చింది. సౌదీకి చెందిన వ్యాపారి తన ఆస్తిలో సగ భాగాన్ని చారిటీకి రాయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం ఆయన ముగ్గురు కొడుకులకు నచ్చక పోవడంతో వ్యాపారాల నుంచి ఆయనను పక్కన పెట్టేందుకు ఎత్తులు వేస్తున్నారు. తన తండ్రికి ఆల్జీమర్స్ అని, ఆయనకు వ్యాపారాలను నడిపే సామర్థ్యం లేదంటూ కొడుకులు కోర్టుకెక్కారు. తండ్రి కూడా కోర్టుకెక్కి కొడుకులపై ఇంపైటీ కేసు(ద్రోహం కేసు) పెట్టారు. 


సదరు వ్యాపారికి రెండేళ్ల క్రితం యాక్సిడెంట్ జరగడంతో అప్పుడప్పుడు మతిమరుపు వస్తుంటుంది. దీన్నే కొడుకులు అవకాశంగా తీసుకుని తండ్రిని ఆస్తికి దూరం చేయాలనుకుంటున్నారు. ఇటువంటి కేసులు కోర్టుకు వచ్చినప్పుడు తల్లితండ్రుల ఆరోగ్య పరిస్థితిపై కోర్టు మెడికల్ రిపోర్టులను కోరుతుందని న్యాయవాది అబ్దుల్ సలామ్ తెలిపారు. తల్లిదండ్రులకు వ్యాపారాలను నడిపే సామర్థ్యం లేదని తెలిస్తే ఈ కేసు షారియా జడ్జి వద్దకు వెళ్తుందన్నారు. కేసును కొట్టివేయాలా లేదా వ్యాపారాలను కొడుకులకు అప్పగించాలా అన్నది షారియా జడ్జీనే తేలుస్తారని అన్నారు. 


ప్రస్తుత కేసులో తండ్రి ఆల్జీమర్స్‌ ఉండటంతో కేసు తామే గెలుస్తామని కొడుకులు దీమాతో ఉన్నారని న్యాయమూర్తి చెప్పుకొచ్చారు. అయితే మరోపక్క తండ్రి కొడుకులపై ద్రోహం చేస్తున్నారనే కేసు పెట్టడంతో జడ్జి ఎటువంటి తీర్పు ఇస్తారో ఆసక్తిగా మారిందన్నారు. తన తండ్రి ఆస్తిని చారిటీకి రాయాలనుకున్నందుకే వ్యాపారి ముగ్గురు కొడుకులు తండ్రిని వ్యాపారాల నుంచి తొలగించాలని అనుకుంటున్నారని సదరు న్యాయవాది పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-25T14:39:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising