అగ్రరాజ్యంలో మళ్లీ కాల్పులు.. ఆరుగురి మృతి
ABN, First Publish Date - 2021-05-11T13:25:13+05:30
అప్పటి వరకూ ఆనందంలో మునిగిపోయిన పుట్టినరోజు వేడుకలు.. ఒక్కసారిగా విషాదాన్ని నింపాయి. కొలొరాడో స్ర్పింగ్స్ నగరంలో ఒక చోట మొబైల్ హోమ్ పార్క్లో శనివారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఓ దుండగుడు లోనికి వచ్చి తుపాకీతో కాల్పులకు దిగాడు. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
కొలొరాడో(అమెరికా): అప్పటి వరకూ ఆనందంలో మునిగిపోయిన పుట్టినరోజు వేడుకలు.. ఒక్కసారిగా విషాదాన్ని నింపాయి. కొలొరాడో స్ర్పింగ్స్ నగరంలో ఒక చోట మొబైల్ హోమ్ పార్క్లో శనివారం రాత్రి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఓ దుండగుడు లోనికి వచ్చి తుపాకీతో కాల్పులకు దిగాడు. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. వెంటనే అతడు తనకు తాను కాల్చుకున్నాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. అతడిని మృతి చెందిన వారిలోని ఒక మహిళకు స్నేహితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-05-11T13:25:13+05:30 IST