ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌదీలో ఆరుగురు భారతీయులు అరెస్ట్.. చేసిన నేరం ఏంటంటే..

ABN, First Publish Date - 2021-07-25T21:46:40+05:30

యజమానిని మోసం చేసిన కేసులో ఆరుగురు భారతీయులు కటకటాలపాలైన ఘటన సౌదీ అరేబియాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: యజమానిని మోసం చేసిన కేసులో ఆరుగురు భారతీయులు కటకటాలపాలైన ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన  ఆరుగురు వ్యక్తులు సౌదీ అరేబియాలోని ఓ వ్యాపారి వద్ద గత కొన్నేళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సరుకు దిగుమతికి సంబంధించిన డబ్బును చెల్లిస్తున్నట్టు యజమానిని నమ్మిస్తూ సుమారు రూ. 6.75కోట్లను కాజేశారు. ఉద్యోగుల ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన యజమాని పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టి ఆరుగురు యువకులు వ్యాపారిని మోసం చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే వారిని అదుపులోకి తీసుకుని, వారు దోచుకున్న ఆరు కోట్ల డబ్బును సీజ్ చేశారు. కాగా.. అరెస్ట్ అయిన వ్యక్తులకు 20-30ఏళ్ల మధ్య వయసు ఉంటుందని సౌదీ స్థానిక మీడియా పేర్కొంది. అయితే అరెస్ట్ అయిన భారతీయుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. 


Updated Date - 2021-07-25T21:46:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising