ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రియాద్‌లో ఆరుగురు భారత ప్రవాసులు అరెస్ట్..!

ABN, First Publish Date - 2021-07-24T14:18:38+05:30

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అక్రమ డబ్బు బదిలీలు చేస్తున్న ఆరుగురు భారత ప్రవాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి ఈ ఆరుగురు ఓ ముఠాగా ఏర్పడి చట్ట విరుద్ధంగా డబ్బు బదిలీ చేస్తున్నట్లు సౌదీ పోలీసులు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అక్రమ డబ్బు బదిలీలు చేస్తున్న ఆరుగురు భారత ప్రవాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి ఈ ఆరుగురు ఓ ముఠాగా ఏర్పడి చట్ట విరుద్ధంగా డబ్బు బదిలీ చేస్తున్నట్లు సౌదీ పోలీసులు గుర్తించారు. ఓ సౌదీ వ్యక్తికి చెందిన వాణిజ్య బ్యాంక్ ఖాతా ద్వారా ఈ లావాదేవీలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సౌదీ వ్యక్తిని ఈ ముఠా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులకు చెల్లింపులు చేస్తున్నట్లు నమ్మించి అక్రమ నగదు బదిలీలు చేశారని రియాద్ పోలీస్ అధికారి ఖలీద్ అల్ కరిదిస్ వెల్లడించారు.


ఇలా సుమారు 3.4 మిలియన్ సౌదీ రియాళ్లు ట్రాన్స్‌ఫర్ అయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. నిందితులందరూ 20 నుంచి 30 ఏళ్లలోపు వయసు వారేనని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించామని, త్వరలోనే వారిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు చెప్పారు. ఇక మొత్తం 34.8 మిలియన్ల సౌదీ జనాభాలో సుమారు 10.5 మిలియన్ల మంది ప్రవాసులు ఉన్నట్లు సమాచారం. కాగా, గడిచిన కొన్ని నెలలుగా దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిపై సౌదీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దీనిలో భాగంగా నివాస, సరిహద్దు వ్యవస్థలను ఉల్లంఘించిన వారి పట్ల సౌదీ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2021-07-24T14:18:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising