ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Residency Visa: 6నెలలకు పైగా UAE వెలుపల ఉన్నా సరే.. ఈ 6 కేటగిరీల ప్రవాసులు తిరిగి ఆ దేశానికి వెళ్లొచ్చు..

ABN, First Publish Date - 2021-11-09T15:43:54+05:30

చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ వీసా కలిగిన ప్రవాసులు విదేశాలకు వెళ్లిన సమయంలో 6 నెలలకు మించి యూఏఈ బయట ఉండరాదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ వీసా కలిగిన ప్రవాసులు విదేశాలకు వెళ్లిన సమయంలో 6 నెలలకు మించి యూఏఈ బయట ఉండరాదు. అలా ఉంటే వారి వీసా చెల్లదు. అలాగే వారికి తిరిగి యూఏఈలో ప్రవేశానికి అనుమతి ఉండదు. ఎంట్రీ వీసా పొందితేగానీ వారు తిరిగి యూఏఈలో అడుగుపెట్టలేరు. అయితే, తాజాగా ఎమిరేట్స్ డిజిటల్ గవర్నమెంట్ ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే ఆరు కేటగిరీ ప్రవాసులకు మినహాయింపులు ఇచ్చింది. ఈ ఆరు కేటగిరీలకు చెందిన వాలీడ్ రెసిడెన్సీ వీసా కలిగిన ప్రవాసులు ఆరు నెలలకు పైగా విదేశాల్లో ఉన్న తిరిగి యూఏఈ వచ్చేందుకు ఎలాంటి ఆటంకం ఉండదు. ఈ మేరకు డిజిటల్ గవర్నమెంట్ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఆరు కేటగిరీలకు సంబంధించిన మినహాయింపులను స్పష్టంగా వివరించడం జరిగింది. అవేంటంటే.. 


1. ఎమిరటీ భర్త స్పాన్సర్ చేసే విదేశీ భార్య 

2. తన యజమాని ద్వారా చికిత్స కోసం విదేశాలకు పంపబడే ప్రభుత్వ సంస్థ కార్మికులు(అయితే, చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన కార్మికుడు/కార్మికురాలు ఆరోగ్యశాఖ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన హెల్త్ అథారిటీ ఆమోదం పొందిన మెడికల్ రిపోర్టు సమర్పించడం తప్పనిసరి.) 

3. విదేశాల్లో చదువుతున్న విద్యార్థి లేదా విదేశాల్లో చికిత్స పొందుతున్న వ్యక్తితో పాటు గృహ కార్మికులు

4. విదేశాలలో యూఏఈకి ప్రాతినిధ్యం వహించే దౌత్య, కాన్సులర్ మిషన్‌ల సభ్యులతో పాటు గృహ కార్మికులు, యూఏఈలో రెసిడెన్సీ వీసా కలిగి ఉన్న ఈ మిషన్‌ల ఉద్యోగులు

5. శిక్షణ లేదా ప్రత్యేక కోర్సుల కోసం వారి యజమాని పంపిన ప్రభుత్వరంగ ఉద్యోగులు, విదేశాల్లోని యజమానుల కార్యాలయాల ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలు 

6. విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి విదేశాలకు వెళ్లే రెసిడెంట్ స్టూడెంట్. 


Updated Date - 2021-11-09T15:43:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising