ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రముఖ గాయని సుశీలకు ప్రతిష్ఠాత్మక బ్రిటన్ పురస్కారం

ABN, First Publish Date - 2021-03-05T13:27:40+05:30

మహిళా దినోత్సవం సందర్భంగా బ్రిటన్‌కు చెందిన యూకే ఉమెన్‌ నెట్‌వర్క్‌ (యూకేడబ్ల్యూనెట్‌) అందజేసే ప్రతిష్ఠాత్మక అవార్డుకు గాయని పి.సుశీల ఎంపికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్‌, మార్చి 4: మహిళా దినోత్సవం సందర్భంగా బ్రిటన్‌కు చెందిన యూకే ఉమెన్‌ నెట్‌వర్క్‌ (యూకేడబ్ల్యూనెట్‌) అందజేసే ప్రతిష్ఠాత్మక అవార్డుకు గాయని పి.సుశీల ఎంపికయ్యారు. ఏటా మహిళా దినోత్సవం రోజున.. యూకేడబ్ల్యూనెట్‌ ఆధ్వర్యంలో బ్రిటిష్‌ పార్లమెంట్‌లో ఈ అవార్డును అందజేస్తారు. గత ఏడాది వరకు కేవలం ఇంగ్లండ్‌కు చెందిన వారినే ఈ అవార్డుకు ఎంపిక చేయగా.. ఈ సారి బ్రిటన్‌ బయటి వారినీ పరిగణనలోకి తీసుకున్నారు. సింగపూర్‌, అమెరికా, జర్మనీ తదితర దేశాలకు చెందిన ఒక్కో మహిళను ఈ అవార్డు వరించగా.. ఏడుగురు భారతీయ మహిళలు యూకేడబ్ల్యూనెట్‌కు ఎంపికవ్వడం గమనార్హం..! ఆయా రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ఈ పురస్కారాన్ని అందజేస్తారు. గాయని పి.సుశీలతోపాటు.. భారత్‌కు చెందిన ఎం.వనిత, సీడీఆర్‌ ప్రసన్న ఎడయిల్లియం, మధుమిత, సెల్వకుమారీ నటరాజన్‌, ఏఆర్‌ రెహానా, మాయా రాఘవన్‌లు ఈ నెల 6న జూమ్‌ మీటింగ్‌ ద్వారా జరిగే కార్యక్రమంలో అవార్డులు అందుకుంటారు.

Updated Date - 2021-03-05T13:27:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising