ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్వాదశ జ్యోతిర్లింగాల విశిష్టతను చాటిన నృత్య ప్రదర్శన

ABN, First Publish Date - 2021-07-27T02:16:04+05:30

సింగపూర్: గురుపౌర్ణమి సందర్భంగా వన్‌నెస్ ఆఫ్ గాడ్ అనే ఇతివృత్తంతో యూట్యూబ్ మాధ్యమంగా ద్వాదశ జ్యోతిర్లింగాలపై నిర్వహించిన నృత్య ప్రదర్శన ప్రత్యేకత సంతరించుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: గురుపౌర్ణమి సందర్భంగా వన్‌నెస్ ఆఫ్ గాడ్ అనే ఇతివృత్తంతో అంతర్జాల వేదికగా ద్వాదశ జ్యోతిర్లింగాలపై నిర్వహించిన నృత్య ప్రదర్శన ప్రత్యేకత సంతరించుకుంది. భారత్‌‌లోని 12 జ్యోతిర్లింగాల విశిష్టతను వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారికి తెలియచేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. అమెరికా, రష్యాల్లోని 11 నృత్య శిక్షణాలయాలకు చెందిన 58 మంది గురు- శిష్య బృందం ఏడు వైవిధ్య శాస్త్రీయ నృత్య రీతులలో నయనానందకరంగా ప్రదర్శించారు. మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథుడి ఆవిర్భావఘట్టం నుండి మొదలు పెట్టి, ద్వాదశ జ్యోతిర్లింగాల కీర్తనలపై అద్భుతమైన నృత్యం, అత్యుత్తమ దృశ్యమాన ప్రభావాలతో కనుల ముందు ఆయా దివ్య జ్యోతిర్లింగ క్షేత్రాలని ఆవిష్కరింపచేశారు. 



ద్వాదశ జ్యోతిర్లింగ గాథల కీర్తన లోని పల్లవిని వివిధ నాట్యశైలుల గురువులందరూ కలిసి ప్రదర్శించారు. తరువాత వరసగా వివిధ జ్యోతిర్లింగ గాథలను కూచిపూడి- రాజేష్ శిష్యబృందం, భరతనాట్యం- చందన శిష్యబృందం, నైనా శిష్యబృందం, ఒడిస్సీ - భిధీష శిష్యబృందం, సీమ శిష్యబృందం; మోహినియట్టం - శ్రీమతి సరస్వతి శిష్య బృందం; ఆంధ్ర నాట్యం - హేమ శిష్యబృందం; మణిపురి - మిత్ర శిష్య బృందం; కథక్ - ప్రగ్య శిష్యబృందం, దిపన్విత శిష్యబృందం; నృత్యసభ ఫౌండేషన్, రష్యా - గురుశిష్య బృందం అద్భుతంగా ప్రదర్శించారు. రుషిపీఠం వ్యవస్థాపకులు షణ్ముఖ శర్మ సమన్వయ వ్యాఖ్యానంతో సాగిన నృత్యరూపకం తెలుగువారిని అమితంగా ఆకట్టుకుందని కార్యక్రమ ప్రధాన నిర్వాహకురాలు వాణి గుండ్లాపల్లి తెలిపారు. 

















Updated Date - 2021-07-27T02:16:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising