ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో భారీ బిల్లుకు అమెరికన్ సెనేట్ ఆమోదం!

ABN, First Publish Date - 2021-07-30T19:43:23+05:30

అగ్రరాజ్యం అమెరికాలో మౌలిక సదుపాయాల కోసం మరో భారీ బిల్లుకు సెనేట్ ఆమోదం తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో మౌలిక సదుపాయాల కోసం మరో భారీ బిల్లుకు సెనేట్ ఆమోదం తెలిపింది. 1 ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.75 లక్షల కోట్లు) విలువైన ద్వైపాక్షిక మౌలిక సదుపాయాల బిల్లును సెనేట్‌ ప్రాథమికంగా ఆమోదించింది. బుధవారం సెనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో 67-32 ఓట్ల తేడాతో బిల్లు ఆమోదం పొందింది. ఈ ఓటింగ్‌లో 17 మంది రిపబ్లికన్ సెనేటర్లు బిల్లుకు మద్దతుగా ఓటు వేశారు. నిధుల వ్యయానికి సంబంధించి కొన్ని నిబంధనలను సవరించేందుకు జో బైడెన్ సర్కార్ అంగీకరించడంతో బిల్లు సెనేట్‌లో ప్రాథమికంగా గట్టేక్కింది. అయితే, సెనేట్‌లో రిపబ్లికన్, డెమొక్రాట్ల బలం సమంగా(50-50) ఉన్న విషయం తెలిసిందే.


తాజా బిల్లు తుది ఆమోదం పొందాలంటే కనీసం 60 మంది సభ్యులు మద్దతుగా ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ, తుది ఆమోదం విషయంలో రిపబ్లికన్లు ఎంతమేరకు సహకరిస్తారనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ భారీ బిల్లు అమలైతే మాత్రం అగ్రరాజ్యంలో దశాబ్ద కాలం పాటు యేటా 20 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించే వీలు ఉంటుంది. ఈ ప్రణాళికను అధ్యక్షుడు జో బైడెన్ దాదాపు ఒక శతాబ్ద కాలంలో మౌలిక వసతుల కల్పన కోసం ముఖ్యమైన దీర్ఘకాలిక పెట్టుబడిగా పేర్కొన్నారు. అమెరికన్ల భవిష్యత్‌కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. 

Updated Date - 2021-07-30T19:43:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising