ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా మాజీ అధ్యక్షుడిపై డెమొక్రటిక్ పార్టీ నేత దావా!

ABN, First Publish Date - 2021-03-06T23:55:32+05:30

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌నకు వ్యతిరేకంగా కోర్టులో దావా దాఖలైంది. జనవరి 6న కేపిటల్ భవనం వద్ద జరిగిన అల్లర్లను డొనాల్డ్ ట్రంప్ ప్రోత్సహించారని ఆరోపిస్తూ డెమొక్రటిక్ పార్టీకి చెందిన చట్టస

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌నకు వ్యతిరేకంగా కోర్టులో దావా దాఖలైంది. జనవరి 6న కేపిటల్ భవనం వద్ద జరిగిన అల్లర్లను డొనాల్డ్ ట్రంప్ ప్రోత్సహించారని ఆరోపిస్తూ డెమొక్రటిక్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు ఎరిక్ స్వాల్‌వెల్ వాషింగ్టన్ డిస్ట్రిక్ట్‌ కోర్టులో శుక్రవారం రోజు ఈ దావా వేశారు. డొనాల్డ్ ట్రంప్, అతని కొడుకు డొనాల్డ్ జూనియర్, లాయర్ రూడీ గియులియాని తదితరలు.. అబద్ధాలను ప్రచారం చేశారని..అంతేకాకుండా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే కేపిటల్ భవనం వద్ద ఘర్షణలు చోటు చేసుకున్నాయని ఎరిక్ స్వాల్‌వెల్ తన పిటిషన్‌లో ఆరోపించారు. 


ఇదిలా ఉంటే.. యూఎస్ కాంగ్రెస్ అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు జనవరి 6న కేపిటల్ భవనంలో సమావేశమైంది. ఈ సందర్భంగా వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు కేపిటల్ భవనం వద్ద హల్‌చల్ చేశారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో దాదాపు ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే దీన్ని ట్రంపే ప్రోత్సహించారని ఆరోపిస్తూ.. డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఓ చట్టసభ సభ్యుడు గత నెలలో ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. తాజాగా అదే పార్టీకి చెందిన మరో సభ్యుడు వాషింగ్టన్ డిస్ట్రిక్ట్ ‌కోర్టులో దావా వేశారు. 


Updated Date - 2021-03-06T23:55:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising