ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీవు అసలు బట్టలే వేసుకోలేదంటూ.. మహిళా బాడీ బిల్డర్‌ను విమానం ఎక్కకుండా ఆపేసిన సిబ్బంది.. చివరికి

ABN, First Publish Date - 2021-07-13T23:23:58+05:30

ఆమె ఓ మహిళా బాడీ బిల్డర్. దానికి తగ్గట్టుగానే ఎప్పుడు డ్రెస్ వేసుకోవడం ఆమెకు అలవాటు. ఇదే ఆమెకు ఓ విమానాశ్రయంలో చేదు అనుభవం మిగిల్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: ఆమె ఓ మహిళా బాడీ బిల్డర్. దానికి తగ్గట్టుగానే ఎప్పుడు డ్రెస్ వేసుకోవడం ఆమెకు అలవాటు. ఇదే ఆమెకు ఓ విమానాశ్రయంలో చేదు అనుభవం మిగిల్చింది. కింద చిన్న షార్ట్, పైన కూడా చిన్నగా ఉండే టాప్ వేసుకున్న ఆమెను అమెరికన్ ఎయిర్‌లైన్‌కు చెందిన గేట్ ఏజెంట్.. 'మీరు అసలు బట్టలే వేసుకోలేదు. వేసుకున్న కూడా నగ్నంగా ఉన్నట్టే ఉన్నాయి. వాటితో విమానం ఎక్కితే తోటి ప్రయాణికులకు ఇబ్బంది. కనుక మీరు విమానం ఎక్కడానికి వీల్లేదంటూ' ఆపేశాడు. దాంతో కంగుతినడం ఆ మహిళా బాడీ బిల్డర్ వంతైంది. ఈ వింత అనుభవం టర్కీకి చెందిన డెనిజ్ సేపినార్‌ అనే మహిళా బాడీ బిల్డర్‌కు గత గురువారం డల్లాస్ ఫార్ట్ వర్త్ ఇంటర్నెషనల్‌ ఎయిర్‌పోర్టులో ఎదురైంది. 


మొదట గేట్ ఏజెంట్ ఏదో జోక్ చేస్తున్నాడులే అనుకుందట డెనిజ్. కానీ, అతడు సీరియస్‌గా చెబుతున్నట్లు గ్రహించిన ఆమెకు కొద్దిసేపు నోట మాట రాలేదు. చాలా భయమేసిందని కూడా ఆమె పేర్కొన్నారు. దాంతో చేసేదేమిలేక టాప్‌పై నుంచి ఓ టీషర్ట్ వేసుకుందామె. అయినా, గేట్ ఏజెంట్ ఆమెను వదిలిపెట్టలేదు. అలా రెండు విమానాలు వదులుకుంది డెనిజ్. అమెరికన్ ఎయిర్‌లైన్స్ నిబంధనల ప్రకారం డ్రెస్ కోడ్ పాటించని ప్రయాణికులకు విమానం ఎక్కేందుకు అనుమతి ఉండదని గేట్ ఏజెంట్ తెగేసి చెప్పాడు. దాంతో ఆమె మంచిగా డ్రెస్ వేసుకుని ఆ తర్వాతి రోజు మరో విమానంలో మియామీ చేరుకున్నట్లు తెలిపింది. టర్కీలో డ్రెసింగ్ విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడంతో అమెరికాలో స్వేచ్ఛగా ఉందామని వస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి అని ఆమె వాపోయారు. డెనిజ్ సేపినార్‌ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనకు ఎదురైన ఈ చేదు అనుభవం గురించి చెప్పడంతో.. అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో కొంతమంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్స్ పెడితే.. మరికొందరు మాత్రం గేట్ ఏజెంట్ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని విమర్శించారు.   


Updated Date - 2021-07-13T23:23:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising