ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హజ్ యాత్రికుల విషయంలో సౌదీ కీలక నిర్ణయం !

ABN, First Publish Date - 2021-03-04T20:09:24+05:30

హజ్ యాత్రికుల విషయమై సౌదీ అరేబియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాధ్: హజ్ యాత్రికుల విషయమై సౌదీ అరేబియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది హజ్ యాత్రకు వచ్చే వారికి కొవిడ్-19 టీకా తప్పనిసరి చేసింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈసారి యాత్రకు అవకాశం ఇస్తామని సౌదీ స్పష్టం చేసింది. ఈ మేరకు సౌదీ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. "ఈ ఏడాది కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే హజ్ యాత్రకు అనుమతి ఉంటుంది. హజ్ యాత్రికులకు ఈసారి ఇదే ప్రధాన కండిషన్ కూడా." అని హెల్త్ మినిస్ట్రీ తన ప్రకటనలో పేర్కొంది. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి తవ్ఫిక్ అల్ రబియా సంతకం చేసిన ఈ సర్క్యూలర్‌ను సంబంధిత అధికారులు మీడియాకు అందించారు. అయితే, ఈ ఏడాది హజ్ యాత్రకు సౌదీ ఎంతమంది యాత్రికులను అనుమతి ఇవ్వనుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక గతేడాది కరోనా కారణంగా విదేశీ యాత్రికులను నిషేధించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-03-04T20:09:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising