ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలసదారుల రెసిడెన్సీ పర్మిట్ల కోసం Saudi సరికొత్త విధానం.. ఇకపై..

ABN, First Publish Date - 2021-11-25T14:00:36+05:30

వలసదారులకు ఇచ్చే రెసిడెన్సీ పర్మిట్ల(ఇఖామా) కోసం సౌదీ అరేబియా తాజాగా సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై వీటి జారీ, పునరుద్ధరణ అనేది ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ మేరకు ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. అయితే, దీని నుంచి గృహకార్మికులకు మాత్రం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: వలసదారులకు ఇచ్చే రెసిడెన్సీ పర్మిట్ల(ఇఖామా) కోసం సౌదీ అరేబియా తాజాగా సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇకపై వీటి జారీ, పునరుద్ధరణ అనేది ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రమే చేయడం జరుగుతుంది. ఈ మేరకు ఆ దేశ అంతర్గత మంత్రిత్వశాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. అయితే, దీని నుంచి గృహకార్మికులకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్, మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సౌదీ డేటా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (ఎస్‌డీఏఐఏ) సహకారంతో ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. 


ఇక ఈ కొత్త విధానం ప్రకారం యజమానులు ప్రతి మూడు, ఆరు, తొమ్మిది, పన్నెండు నెలలకు వర్క్ పర్మిట్‌లు, రెసిడెన్సీ పర్మిట్‌లను పునరుద్ధరించవచ్చు, ఆర్థిక పరిహారం అందించవచ్చు. అబ్షెర్ బిజినెస్, ముఖీమ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందని పాస్‌పోర్ట్స్ జనరల్ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. అలాగే వర్క్ పర్మిట్‌లకు సంబంధించిన సేవల కోసం క్వివా ప్లాట్‌ఫాంను వినియోగించుకోవాలని మానవ వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతోపాటు కార్మిక సేవల కోసం ఎలక్ట్రానిక్ పోర్టల్ ద్వారా యాక్సెస్ చేయవచ్చని పేర్కొంది. కాగా, వలసదారుడి ఫీజు(ఆర్థిక పరిహారం) చెల్లింపు తర్వాత మాత్రమే రెసిడెన్సీ పర్మిట్ల పునరుద్ధరణ లింక్ చేయడానికి యజమానికి వీలు కలుగుతుందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-11-25T14:00:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising