ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజద్రోహానికి పాల్పడిన సైనికులను ఉరి తీసిన సౌదీ

ABN, First Publish Date - 2021-04-11T13:41:30+05:30

రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ రాజద్రోహానికి పాల్పడిన ముగ్గురు సైనికులను సౌదీ ప్రభుత్వం శనివారం ఉరి తీసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: రక్షణ మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ రాజద్రోహానికి పాల్పడిన ముగ్గురు సైనికులను సౌదీ ప్రభుత్వం శనివారం ఉరి తీసింది. శత్రువులతో కలిసి రాజద్రోహానికి పాల్పడిన ముగ్గురు సైనికులు కోర్టులో దోషులుగా తేలారని సౌదీ తెలిపింది. ఇరాన్ మద్దతు గల హౌతీ రెబెల్స్‌కు వ్యతిరేకంగా పొరుగుదేశం యెమెన్‌లో సైనిక ప్రచారానికి సౌదీ నాయకత్వం వహిస్తోంది. ఈ నేపథ్యంలో శత్రు దేశాలతో చేతులు కలిపి సౌదీకి హాని కలిగిస్తున్న వారిని గుర్తించి సౌదీ ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షిస్తోంది. ఒక్క 2019 సంవత్సరంలోనే సౌదీ 184 మందిని ఉరితీసింది. ప్రపంచంలోని మరే దేశంలో కూడా ఇన్ని ఉరిశిక్షలు పడలేదని లెక్కలు చెబుతున్నాయి. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్(35) గత మూడేళ్లుగా తన ప్రత్యర్థులను గుర్తించి వారిని శిక్షిస్తూ తన పదవిపై పట్టు పెంచుకుంటున్నారు. రాజ కుటుంబసభ్యులు, వ్యాపారవేత్తలు, మతాధికారులు ఇలా అనేక మందిని ఈ మూడేళ్లలో ఆయన జైలుకు పంపారు.

Updated Date - 2021-04-11T13:41:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising