ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తబ్లీఘీ జమాత్‌పై సౌదీ అరేబియా నిషేధం..

ABN, First Publish Date - 2021-12-12T00:56:48+05:30

భారత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మతసంస్థ తబ్లీఘీ జమాత్‌పై సౌదీ ప్రభుత్వం తాజాగా నిషేధం విధించింది. ఉగ్రవాదానికున్న ద్వారాల్లో ఈ సంస్థ కూడా ఒకటిని, దీని వల్ల సమాజానికి ప్రమాదమని ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: భారత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మతసంస్థ తబ్లీఘీ జమాత్‌పై సౌదీ అరేబియా ప్రభుత్వం తాజాగా నిషేధం విధించింది. ఉగ్రవాదానికున్న ద్వారాల్లో ఈ సంస్థ కూడా ఒకటిని, దీని వల్ల సమాజానికి ప్రమాదమని ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ సంస్థతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదంటూ ప్రజలను హెచ్చరించాలని అక్కడి మసీదులను ఆదేశించింది. ఈ మేరకు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేసింది. ఈ సంస్థ చేసిన తప్పులను, సమాజానికున్న అపాయాన్ని శుక్రవారం మత ప్రార్థనల తరువాత ప్రజలకు వివరించాలని మసీదులకు సూచించింది. తబ్లీఘీ జమాత్ 1926లో భారత్‌లో ఏర్పాటైన విషయం తెలిసిందే. మస్లింలు మతసంప్రదాయాలను పాటించాలంటూ ప్రచారం చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఒక అంచనా ప్రకారం.. ఈ సంస్థలో 40 కోట్ల మంది సభ్యులున్నారు. 

Updated Date - 2021-12-12T00:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising