ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid-19: వివిధ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు సౌదీ శుభవార్త

ABN, First Publish Date - 2021-07-22T17:22:58+05:30

కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతుండడంతో వివిధ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు సౌదీ అరేబియా శుభవార్త చెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రియాద్: కరోనా నేపథ్యంలో ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతుండడంతో వివిధ దేశాల్లో చిక్కుకున్న ప్రవాసులకు సౌదీ అరేబియా శుభవార్త చెప్పింది. ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్, విజిట్ వీసాల గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈ మేరకు బుధవారం సౌదీ పాస్‌పోర్ట్ జనరల్ డైరెక్టరేట్ కీలక ప్రకటన చేసింది. దీని కోసం ప్రవాసులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతేగాక ఈ పొడిగించిన గడువు కింగ్డమ్ బయట ఉన్న ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్, విజిట్ వీసాలకు ఆటోమెటిక్‌గా వర్తిస్తుందని తెలిపింది.


ప్రవాసులు పాస్‌పోర్టుల కేంద్రాలను సందర్శించాల్సిన అవసరం లేకుండా జాతీయ సమాచార కేంద్రం సహకారంతో ఈ పొడిగింపును ఎలక్ట్రానిక్‌గా వర్తింప చేయడం జరుగుతుందని డైరెక్టరేట్ సూచించింది. కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజిజ్ అల్ సౌద్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాస్‌పోర్ట్ జనరల్ డైరెక్టరేట్ బుధవారం మీడియాతో చెప్పింది. ఆగస్టు 31 వరకు యూఏఈలో ప్రవేశంలేని దేశాలకు చెందిన ప్రవాసుల రెసిడెన్సీ పర్మిట్స్‌తో పాటు ఎగ్జిట్, రీఎంట్రీ వీసాలకు ఈ పొడిగింపు వర్తిస్తుంది. అలాగే ఇవే దేశాలకు చెందిన సందర్శకుల విజిట్ వీసాలకు కూడా ఇది వర్తిస్తుందని పాస్‌పోర్ట్ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది.   

Updated Date - 2021-07-22T17:22:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising