ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌గా సత్య నాదెళ్ల

ABN, First Publish Date - 2021-06-18T11:10:38+05:30

మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, తెలుగు తేజం సత్య నాదెళ్లను మరో ప్రతిష్ఠాత్మక పదవి వరించింది. ఆయన్ని చైర్మన్‌గా నియమిస్తున్నట్టు కంపె నీ ప్రకటించింది. మైక్రోసాప్ట్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు అందరూ సత్య నాదెళ్లను చైర్మన్‌గా నియమించేందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ కంపెనీకి మూడో చైర్మన్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏకగ్రీవంగా ఎన్నికైన తెలుగు తేజం

ఇప్పటికే సీఈవోగావ్యవహరిస్తున్న సత్య

న్యూయార్క్‌: మైక్రోసాఫ్ట్‌ సీఈఓ, తెలుగు తేజం సత్య నాదెళ్లను మరో ప్రతిష్ఠాత్మక పదవి వరించింది. ఆయన్ని చైర్మన్‌గా నియమిస్తున్నట్టు కంపె నీ ప్రకటించింది. మైక్రోసాప్ట్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు అందరూ సత్య నాదెళ్లను చైర్మన్‌గా నియమించేందుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ కంపెనీకి మూడో చైర్మన్‌. సీఈఓగా వ్యవహరిస్తూనే నాదెళ్ల కంపెనీ చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. చైర్మన్‌గా సత్య నాదెళ్ల కంపెనీ వ్యాపార వ్యూహాలు, అవకాశాలు, రిస్కులపై బోర్డుకు ఎప్పటికప్పుడు నివేదిస్తారు. 


ప్రతిభకు పట్టం: ప్రవాస భారతీయుడైన సత్య నాదెళ్ల 2014లో స్టీవ్‌ బాల్మర్‌ స్థానంలో మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై దృష్టి పెట్టడం ద్వారా ఆ రంగంలో మైక్రోసా్‌ఫ్టను ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దారు. దీంతో కంపెనీ రాబడులూ భారీగా పెరిగాయి. నాస్‌డాక్‌లోనూ కంపెనీ షేర్లు హాట్‌హాట్‌గా మారాయి. సత్య నాదెళ్ల సారధ్యంతో ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌ షేర్ల మార్కెట్‌ విలువ రెండు లక్షల కోట్లకు డాలర్ల (భారత కరెన్సీలో రూ.148 లక్షల కోట్లు)కు చేరింది. 



‘ సత్య’ ప్రస్థానం

పుట్టిన తేదీ:  19-08-1967

పుట్టిన ఊరు: హైదరాబాద్‌

విద్యాభ్యాసం: హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌

భారత్‌లోని మణిపాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లో బీఈ (ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌)

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ నుంచి    కంప్యూటర్‌ సైన్స్‌లో ఎంఎస్‌

యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో నుంచి ఎంబీఏ

1992లో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం. అంతకు ముందు  కొద్దికాలం సన్‌ మైక్రోసిస్టమ్స్‌లో ఉద్యోగం

04-02-2014న మైక్రోసాఫ్ట్‌ సీఈఓగా ప్రమోషన్‌

16-06-2021లో మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌గా ఎన్నిక


Updated Date - 2021-06-18T11:10:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising