ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కువైట్‌లో 'లిటిల్ గురు' యాప్ లాంచ్

ABN, First Publish Date - 2021-04-13T17:32:27+05:30

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆదివారం(ఏప్రిల్ 11న) జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) ఫౌండేషన్ డే వేడుకల సందర్భంగా సంస్కృతం నేర్చుకునేందుకు రూపొందించబడ్డ 'లిటిల్ గురు' యాప్‌ను ప్రత్యేక అతిథులు లాంచ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కువైట్ సిటీ: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఆదివారం(ఏప్రిల్ 11న) జరిగిన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) ఫౌండేషన్ డే వేడుకల సందర్భంగా సంస్కృతం నేర్చుకునేందుకు రూపొందించబడ్డ 'లిటిల్ గురు' యాప్‌ను ప్రత్యేక అతిథులు లాంచ్ చేశారు. సంస్కృతం నేర్చుకోవాలనుకునే వారి కోసం ఈ యాప్‌ను ఐసీసీఆర్ ప్రత్యేకంగా రూపొందించడం విశేషం. ఈ యాప్‌ను రాయబారి సిబి జార్జ్, రాజ్‌పాల్ త్యాగి(ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీత), అఫ్జల్ హోల్డింగ్ వైస్ చైర్మన్ మునా అల్ ఫరాజ్, సుధీర్ కేపీ(సంస్కృతభారతి కువైట్ సమన్వయకర్త) లాంచ్ చేశారు.


ఈ సందర్భంగా భారత రాయబారి సిబి జార్జ్ మాట్లాడుతూ భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం, అద్భుతమైన వైవిధ్యాన్ని తెలియజేశారు. దీనికోసం భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ చేసిన కృషిని రాయబారి గుర్తు చేశారు. దీనిలో భాగంగానే ఐసీసీఆర్ స్థాపించబడిందని తెలిపారు. అలాగే సంస్కృత భాష గొప్పదనం గురించి కూడా ఆయన సంభాషించారు. ఈ కార్యక్రమంలో ఐసీసీఆర్ గౌరవ అధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధే, ఐసీసీఆర్ డైరెక్టర్ జనరల్ దినేష్ పట్నాయక్ వీడియో సందేశాలను కూడా ప్రదర్శించారు. 



Updated Date - 2021-04-13T17:32:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising