ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో ఇసుక తుఫాను.. 20 వాహనాలు క్రాష్.. ఏడుగురు మృతి

ABN, First Publish Date - 2021-07-27T07:02:37+05:30

అగ్రరాజ్యం అమెరికాలో ఇసుక తుఫాను కలకలం రేపింది. దీని వల్ల రోడ్డుపై వెళ్తున్న కనీసం 20 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉటా: అగ్రరాజ్యం అమెరికాలో ఇసుక తుఫాను కలకలం రేపింది. దీని వల్ల రోడ్డుపై వెళ్తున్న కనీసం 20 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం అమెరికాలోని ఉటా ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఇక్కడ కరోష్‌కు సమీపంలోని ఇంటర్‌స్టేట్ 15పై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో ప్రత్యక్షం అయ్యాయి. వరుసపెట్టి కార్లు, కంటైనర్లు వంటివి ఒకదానితో ఒకటి ఢీకొట్టుకొని కుప్పగా పడి ఉన్న ఈ ఫొటోలు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన కొందరిని విమానాల్లో ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2021-07-27T07:02:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising