ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

550 చెల్లిస్తే.. ప్రవాసులకు రూ.10 లక్షల బీమా

ABN, First Publish Date - 2021-11-02T13:24:35+05:30

ప్రవాస తెలుగువారు ఏడాదికి రూ.550 చొప్పున చెల్లిస్తే.. రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వెంకట్‌ ఎస్‌.మేడపాటి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వెంకట్‌ వెల్లడి

అమరావతి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రవాస తెలుగువారు ఏడాదికి రూ.550 చొప్పున చెల్లిస్తే.. రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వెంకట్‌ ఎస్‌.మేడపాటి తెలిపారు. మూడేళ్లపాటు ఈ స్వల్ప మొత్తం చెల్లిస్తే సరిపోతుందని సోమవారం విలేకరులతో చెప్పారు.  ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి దాదాపు 20 లక్షల మంది విదేశాల్లో ఉన్నారని తెలిపారు. వీరందరికీ ఏ సమస్య వచ్చినా ఏపీఎన్‌ఆర్‌టీ నిరంతరం అందుబాటులో ఉండి సేవలందిస్తోందన్నారు. ఈ రెండేళ్లలో ప్రవాసంలో మరణించిన వారి కుటుంబాలకు 1.5 కోట్లు పరిహారంగా అందించినట్లు చెప్పారు. ఆయా దేశాల్లో ప్రవాసాంధ్రులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిరంతరం పనిచేసే హెల్ప్‌లైన్‌ నంబ రు 8632340678, వాట్సాప్‌ నంబరు 8500027678లో సంప్రదించవచ్చన్నారు.

Updated Date - 2021-11-02T13:24:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising