ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిస్కౌంట్‌లు ప్రకటించిన రెస్టారెంట్‌లు.. ఈ ఆఫర్లు వారికి మాత్రమేనట!

ABN, First Publish Date - 2021-01-26T01:03:22+05:30

యూఏఈలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. స్వచ్ఛంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వంతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజలకు పిలుపునిస్తున్నాయి. ఈ క్రమంలో దు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయి: యూఏఈలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. స్వచ్ఛంగా ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వంతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజలకు పిలుపునిస్తున్నాయి. ఈ క్రమంలో దుబాయిలోని కొన్ని రెస్టారెంట్‌లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. టీకాపై ప్రజలను చైతన్యపరిచే విధంగా ఓ ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. దుబాయిలోని పలు రెస్టారెంట్‌లు వ్యాక్సిన్‌వైపు ప్రజలను పోత్సహించడంలో భాగంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి.


వ్యాక్సిన్ వేయించుకున్న వారికి.. బిల్లుపై డిసౌంట్లు ఇస్తున్నట్టు వెల్లడించాయి. వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారికి 10శాతం.. రెండో డోసు తీసుకున్న వారికి 20శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు తెలిపాయి. వ్యాక్సిన్ వేయించుకున్నట్టు ఆధారాలు చూపిన వారికే ఆఫర్లు వర్తిస్తాయని సదరు రెస్టారెంట్‌లు ప్రకటించాయి. కాగా.. ఈ ఆఫర్లపై చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్‌లు చేస్తున్నారు. పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అంటుంటే.. మరికొందరేమో రెస్టారెంట్‌లు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ కామెంట్ చేస్తున్నారు. యూఏఈలో 10 మిలియన్ల జనాభా ఉండగా.. ఇందులో 2.5 మిలియన్ల మందికి అక్కడి ప్రభుత్వం ఇప్పటికే వ్యాక్సిన్‌ను అందించింది. 


Updated Date - 2021-01-26T01:03:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising