ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిర్‌లైన్లకు పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు!

ABN, First Publish Date - 2021-04-08T18:16:37+05:30

గతేడాది లాక్‌డౌన్ సమయంలో క్యాన్సిల్ అయిన విమానాలకు సంబంధించి.. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారి డబ్బులు తిరిగి ఇచ్చేయాలని విమానయాన సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గతేడాది లాక్‌డౌన్ సమయంలో క్యాన్సిల్ అయిన విమానాలకు సంబంధించి.. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారి డబ్బులు తిరిగి ఇచ్చేయాలని విమానయాన సంస్థలకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశించింది. ఇటీవల ఇదే విషయమై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు రద్దు అయిన విమాన సర్వీసులకు సంబంధించిన డబ్బులను ప్రయాణికులకు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరింది. దీనికి మార్చి 31 వరకు గడువు విధించింది. ఈ లోపు ప్రయాణికులకు చెల్లింపులు జరగాలని ఆదేశించింది. దాంతో గో ఎయిర్, ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు డబ్బులు తిరిగి ఇచ్చేశాయి. కానీ, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఆసియా, విస్తారా ఇంకా ప్రయాణికులకు రిఫండ్ చేయలేదు. ఈ నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సెక్రెటరీ బుధవారం విమానయాన సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. లాక్‌డౌన్ సమయంలో రద్దు అయిన విమానాలకు సంబంధించిన డబ్బులను వెంటనే ప్రయాణికులకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. 

Updated Date - 2021-04-08T18:16:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising