ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో మిర్యాలగూడవాసికి అరుదైన గౌరవం

ABN, First Publish Date - 2021-04-10T21:23:40+05:30

అమెరికాలో మిర్యాలగూడవాసికి అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన కామ్‌స్కోప్‌ సంస్థకు మిర్యాలగూడకు చెందిన జొన్నలగడ్డ ప్రవీణ్‌ సీఐవో( చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా) నియ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామ్‌స్కోప్‌ సంస్థ సీఐవోగా నియామకం 

నల్గొండ విద్య, ఏప్రిల్‌ 9: అమెరికాలో మిర్యాలగూడవాసికి అరుదైన గౌరవం లభించింది. అమెరికాలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన కామ్‌స్కోప్‌ సంస్థకు మిర్యాలగూడకు చెందిన జొన్నలగడ్డ ప్రవీణ్‌ సీఐవో( చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌గా) నియమితులయ్యారు. మిర్యాలగూడ మండలం గూడూరుకు చెందిన జొన్నలగడ్డ రంగారెడ్డి, విమలాదేవి దంపతుల కుమారుడు ప్రవీణ్‌ స్థానిక పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశాడు. ఎయిడెడ్‌ కళాశాలలో బీఎస్సీ, ఓయూలో పీజీ చేసి 2001లో ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. 12ఏళ్ల క్రితం కామ్‌స్కో్‌పలో చేరిన ప్రవీణ్‌ ఆ సంస్థలో డైరెక్టర్‌గా, వైస్‌ ప్రెసిడెంట్‌గా, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తదితర హోదాల్లో పనిచేశారు. కామ్‌స్కో్‌పలో 50మంది సాంకేతిక నిపుణుల్లో ముఖ్యడిగా ఉండడంతో సీఐవోగా అరుదైన గౌరవం లభించిందని ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ సీఐవోగా నియామకం కావడంపై సంతోషం వ్యక్తంచేశారు. ఇన్నాళ్ల తన శ్రమకు తగిన గుర్తింపు లభించిందన్నారు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇప్పుడు సీఐవో స్థాయికి ఎదిగానన్నారు. ఈ ఉత్సాహంతో సాంకేతిక ఆవిష్కరణలో మరిన్ని అద్భుతాల కోసం కృషి చేస్తానని పేర్కొన్నాడు.


Updated Date - 2021-04-10T21:23:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising